అమరీందర్ ముందే సిక్స్ కొట్టిన సిద్ధూ.. వీడియో

చండీగఢ్: ఇండియన్ టీమ్ మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూకి సిక్సర్ల సిద్ధూగా పేరుంది. తాను ఆడే రోజుల్లో సిక్సర్లు కొట్టడంలో దిట్టగా ఆయనకు పేరుంది. ఇప్పుడు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అయిన తర్వాత కూడా సిక్స్ కొడతానన్నట్లుగా సిద్ధూ స్టేజ్‌పైనే ఓ షాట్ ఆడారు. ఆ సమయంలో సీఎం అమరీందర్ ఆ పక్కనే కూర్చున్నారు. పంజాబ్ పీసీసీ చీఫ్‌గా ప్రమాణం స్వీకారం కార్యక్రమంలో సిద్ధూ ఇలా చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పంజాబ్ సీఎంగా అమరీందర్‌ను దించాల్సిందే అంటూ పోరాడిన సిద్ధూ చివరికి పీసీసీ చీఫ్ పదవిని దక్కించుకున్నారు. ఆయనకు ఈ పదవి ఇవ్వడాన్ని అమరీందర్ తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఈ ఇద్దరూ శుక్రవారం చాయ్ పే చర్చ అంటూ తమ మధ్య విభేదాలను పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు.
ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా తన పేరును పిలవగానే.. సిద్ధూ నిజంగానే బ్యాటింగ్ చేయడానికి వెళ్తున్నట్లుగా వామప్ చేస్తూ కుర్చీలో నుంచి లేచి ఓ సిక్సర్ షాట్ ఆడుతున్నట్లుగా చేతులు ఊపారు. ప్రమాణ స్వీకారానికి ముందు పంజాబ్ భవన్లో అమరీందర్‌కు రెండు చేతులు జోడించి స్వాగతం పలికారు సిద్దూ. ఎలా ఉన్నారు? మీరు రావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సిద్ధూ అన్నారు.
#WATCH: Newly appointed Punjab Congress president Navjot Singh Sidhu mimics a batting style as he proceeds to address the gathering at Punjab Congress Bhawan in Chandigarh.
— ANI (@ANI) July 23, 2021
(Source: Punjab Congress Facebook page) pic.twitter.com/ZvfXlOBOqi
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

