పాటియాలా కోర్టు ఎదుట లొంగిపోయిన సిద్దూ
కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ శుక్రవారం పాటియాలా కోర్టు ఎదుట లొంగిపోయారు. పాటియాలాలోని తన నివాసం నుంచి మధ్యాహ్నం బయల్దేరి, ఆయన న్యాయమూర్తి ముందు లొంగిపోయారు. 38 ఏళ్ల కిందటి ఓ కేసులో సిద్దూకు ఏడాది పాటు జైలు శిక్ష పడ్డ విషయం తెలిసిందే.
ఇక తన లొంగుబాటు విషయంపై సిద్దూ సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసులో కోర్టు ముందు లొంగిపోయేందుకు తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదని, అయితే.. ఆరోగ్య కారణాల రీత్యా తనకు కొంత సమయం కావాలని సిద్దూ తరపు న్యాయవాది సుప్రీంలో వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రత్యేక బెంచ్ తీర్పు ఇచ్చిందని, అందుకే తామేమీ నిర్ణయం తీసుకోలేమని సుప్రీం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సిద్దూ పాటియాలా కోర్టు ఎదుట లొంగిపోయారు.
పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీం కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. 1988 నాటి ర్యాష్ డ్రైవింగ్ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్, జస్టిస్ ఎస్కే కౌల్‌తో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో బాధితుడైన 65 ఏండ్ల వృద్ధుడిని సిద్ధూ ఉద్దేశపూర్వకంగానే గాయపరిచినట్టు 2018లో సుప్రీంకోర్టు నిర్ధారిస్తూ రూ.వెయ్యి జరిమానా విధించి వదిలేసింది. అయితే జరిమానా మాత్రమే విధించడం సరికాదంటూ బాధితుడి కుటుంబసభ్యులు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా తీర్పు వెలువరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

