సిద్ధూ 8 లక్షల కరెంటు బిల్లు కట్టాలి..

చండీఘడ్ : పంజాబ్‌లో తీవ్ర విద్యుత్తు కొరత ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ కరెంటు కోతలు విధించారు. ఆ కోతలను నవజ్యోత్ సింగ్ సిద్దూ తప్పుపట్టారు. అమరీందర్ పాలన సరిగా లేదని స్వంత పార్టీకి చెందిన సిద్దూ ఇటవల ఫైర్ అయ్యారు. అయితే శిరోమనీ అకాలీ దళ్ నేతలు సిద్దూపై విమర్శలు గుప్పించారు. అమృత్‌సర్‌లో ఉన్న సిద్దూ ఇంటికి 8 లక్షల కరెంటు బిల్లు బాకీ ఉన్నదని, ఆయన ఆ బిల్లు కట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని శిరోమనీ అకాలీదళ్ ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ నేత సిద్ధూ మొత్తం రూ.8,67,540 కరెంటు బిల్లు చెల్సించాల్సి ఉంది. అయితే నిన్నటికే ఆ బిల్ పేమెంట్ చివరి రోజు.
దీని గురించి ఇప్పటి వరకు సిద్ధూ ఏమీ మాట్లాడలేదు. కానీ విద్యుత్తు కోతలను విధిస్తూ ప్రభుత్వం చేసిన నిర్ణయాలను ఎలా సిద్దూ తప్పుపడుతున్నారని శిరోమనీ అకాలీదళ్ ప్రశ్నించింది. విద్యుత్తు కొరత నుంచి బయటపడేందుకు ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్న ఏసీలను బంద్ చేస్తున్నారు. ప్రతి రోజూ అక్కడ 14వేల మెగావాట్ల విద్యుత్తును వినియోగిస్తున్నారు. పంజాబ్‌లో విద్యుత్త సరఫరా అంశం కీలకంగా మారింది. తాము అధికారంలోకి వస్తే 300 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొనడం విశేషం. ప్రస్తుతం పంజాబ్ విద్యుత్తు శాఖకు ఆ రాష్ట్ర సీఎంయే ఇంచార్జీగా ఉన్నారు. 2019లో రాజీనామ చేసిన సమయంలో ఆ శాఖను సిద్దూ కే కేటాయించే ప్రయత్నం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

