Farmers Protest | కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కోసం.. 10న దేశవ్యాప్తంగా రైల్ రోకో
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు ఇతర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 6న దేశ రాజధాని ఢిల్లీకి తరలి రావాలని రైతు నేతలు పిలుపునిచ్చారు. ఇటీవల జరిపిన ఆందోళనలో అసువులు బాసిన రైతు స్వగ్రామం బల్లాహ్లో ఆదివారం జరిగిన సభలో రైతు సంఘం నేతలు శర్వాన్ సింగ్ పంధేర్, జగ్జిత్ సింగ్ దల్లేవాల్ మాట్లాడారు.
- 6న ఢిల్లీకి తరలి రండి
- రైతు సంఘాల పిలుపు
Farmers Protest | న్యూఢిల్లీ, మార్చి 3: కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు పలు ఇతర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 6న దేశ రాజధాని ఢిల్లీకి తరలి రావాలని రైతు నేతలు పిలుపునిచ్చారు. ఇటీవల జరిపిన ఆందోళనలో అసువులు బాసిన రైతు స్వగ్రామం బల్లాహ్లో ఆదివారం జరిగిన సభలో రైతు సంఘం నేతలు శర్వాన్ సింగ్ పంధేర్, జగ్జిత్ సింగ్ దల్లేవాల్ మాట్లాడారు. ఈ నెల 10న రైతులు దేశవ్యాప్తంగా నాలుగు గంటల పాటు రైల్‌రోకో నిర్వహించాలని పిలుపునిచ్చారు. డిమాండ్ల సాధనకు రైతులు ఇప్పటివరకు చేస్తున్న ఆందోళనను తామున్న ప్రదేశం నుంచే కొనసాగిస్తూ మరింత ఉద్ధృతం చేయాలన్నారు. ఢిల్లీ చలో మార్చ్‌ని మరింత వ్యాప్తి చేయాలని కిసాన్ మజ్దూర్ మోర్చా పిలుపునిచ్చింది.
ఈ సందర్భంగా శంభు, ఖనౌరి సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న పంజాబ్, హర్యానా రైతులకు రెండు సంఘాలు మద్దతు ప్రకటిస్తూ ఇతర రాష్ర్టాలకు చెందిన రైతులు, రైతు కూలీలు ఈ నెల 6న ఢిల్లీకి చేరుకుని రైతుల డిమాండ్లపై నినదించాలని పిలుపునిచ్చాయి. ట్రాక్టర్ ట్రాలీలు, ఇతర వాహనాల ద్వారా ఢిల్లీకి చేరుకోలేని ఇతర రాష్ర్టాల రైతులు రైలు, ఇతర మార్గాల ద్వారా చేరుకోవాలని నేతలు సూచించారు. దీనివల్ల ట్రాక్టర్, ట్రాలీల ప్రవేశానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా పర్వాలేదని అన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి మార్చి 10న మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు దేశ వ్యాప్తంగా రైల్‌రోకోలు నిర్వహించాలన్నారు. పంజాబ్‌లోని పంచాయతీలన్నీ రైతుల ఆందోళనకు తీర్మానం చేయాలని, ప్రతి గ్రామం నుంచి ఒక ట్రాక్టర్ ట్రాలీ ఆందోళన జరుగుతున్న బోర్డర్ పాయింట్‌కు పంపాలని వారు కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

