భూమిని ఢీకొట్టనున్న నాసా టెలిస్కోస్
దాదాపు 22 ఏండ్ల క్రితం 2004 నవంబర్ 20న నాసా ప్రయోగించిన 1.5 టన్నుల బరువున్న నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ అంతరిక్ష టెలిస్కోప్ భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించనున్నది.
- 22 ఏండ్ల క్రితం ప్రయోగం.. బరువు సుమారు 1.5 టన్నులు
- శకలాలు పడే జోన్లో హైదరాబాద్, ముంబై, ఇతర ప్రధాన నగరాలు
- అయితే ప్రమాదం జరిగే అవకాశం చాలా తక్కువ.. శాస్త్రవేత్తల వెల్లడి
న్యూఢిల్లీ: దాదాపు 22 ఏండ్ల క్రితం 2004 నవంబర్ 20న నాసా ప్రయోగించిన 1.5 టన్నుల బరువున్న నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ అంతరిక్ష టెలిస్కోప్ భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించనున్నది. నవంబర్ 4న అమెరికా కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు) ఈ టెలిస్కోప్ భూ వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నదని నాసా అంచనా వేస్తున్నది. అయితే దీనికి 11 గంటలు అటూ ఇటూ కావొచ్చని పేర్కొన్నది. వాతావరణంలోకి ప్రవేశించే సమయంలో ఉపగ్రహంలోని చాలాభాగం కాలిపోయే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని శకలాలు భూమిపై పడే ప్రమాదం ఉన్నది. ఈ టెలిస్కోప్ భూమధ్యరేఖకు సమీపంలోని ప్రాంతంలో పడే అవకాశం ఉన్నదని అంచనా.
పశ్చిమ తీరంలోని డామన్ నుంచి తూర్పు తీరంలోని ఒడిశా రాష్ట్రం కటక్ వరకు ఒక ఊహారేఖను గీస్తే, దానికి దక్షిణంగా ఉన్న ప్రాంతాలు రీ ఎంట్రీ జోన్ పరిధిలోకి వస్తాయి. ఈ జోన్లో ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు ఉన్నాయి. అయితే ఈ నగరాలు రీఎంట్రీ జోన్లో ఉన్నంతమాత్రాన అక్కడే శకలాలు పడుతాయని అర్థం కాదు. ఈ టెలిస్కోప్ సముద్రంలో పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.1,500 కిలోల టెలిస్కోప్ మొత్తం బరువులో 100 కిలోల భాగాలు కూడా భూవాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత మిగిలితే ఆశ్చర్యపోవాల్సిందేనని అంతరిక్ష నిపుణుడు మెక్‌డోవెల్ అన్నారు. టెలిస్కోప్ సముద్రంలో కాకుండా భూమిపై పడే అవకాశం కూడా ఉన్నదని శాస్త్రవేత్త బ్రాడ్ టక్కర్ అన్నారు.
అగ్నివీరులకు మరో రెండేండ్ల సర్వీసు పొడిగింపు
న్యూఢిల్లీ: అగ్నివీరులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. నాలుగేండ్ల సర్వీసు పూర్తయిన తర్వాత సాధారణ సైనిక దళాల్లోకి ఎంపికకాని అగ్నివీరుల్లో 75 శాతం మందికి మరో రెండేండ్ల సర్వీసును పొడిగించనున్నట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ ఎస్ఎస్ రాజా సుబ్రమణి ప్రకటించారు. దీంతో వారి సర్వీసు మొత్తం కాలం ఆరేండ్లకు చేరనుంది. అదనపు రెండేండ్ల తర్వాత మరోసారి సాధారణ సైనిక దళాల్లో చేరేందుకు ఎంపిక ప్రక్రియలో అవకాశం కల్పిస్తారు. అయితే పనితీరు, ప్రతిభ ఆధారంగానే తుది ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. సాయుధ దళాల ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. విద్యార్హతలను పదో తరగతి నుండి డిగ్రీ వరకు పెంచుకునే అవకాశాలపైనా దృష్టి పెట్టినట్లు తెలిపారు. 2022లో ప్రారంభమైన అగ్నిపథ్ పథకం కింద తొలి బ్యాచ్ సర్వీసు నవంబర్ 21 నుంచి డిసెంబర్ 31 మధ్య ముగియనుంది. ఈ బ్యాచ్‌లో 18 వేల మందికిపైగా అగ్నివీరులు నాలుగేండ్ల సర్వీసు పూర్తి చేయనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

