Narcotic Control Bureau | డ్రగ్స్ కేసుల్లో బాలీవుడ్ ప్రముఖులు సహా 300 మంది అరెస్ట్
Narcotic Control Bureau | డ్రగ్స్ కేసుల్లో బాలీవుడ్ ప్రముఖులు సహా 300 మంది అరెస్ట్ | గత ఏడాది కాలంలో ముంబై, థానేతోపాటు పరిసర ప్రాంతాల్లో రూ.150కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తెలిపారు. ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్)

ముంబై : గత ఏడాది కాలంలో ముంబై, థానేతోపాటు పరిసర ప్రాంతాల్లో రూ.150కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తెలిపారు. ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్) చట్టం కింద 114 కేసులను నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 34 మంది విదేశీయులు, పలువురు బాలీవుడ్ ప్రముఖులు సహా 300 మందికిపైగా వ్యక్తులను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఏడాది కాలంలో 100 కేజీలకుపైగా డ్రగ్స్, 30 కేజీల చరాస్, 12 కిలోల హెరాయిన్, రెండు కేజీల కొకైన్, 350 కిలోల గంజాయి పట్టుకున్నామని చెప్పారు.
60 కిలోల ఎఫిడ్రిన్, 25 కిలోల ఎండీ (మెఫెడ్రోన్) స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. స్మగ్లర్లకు చెందిన రూ.12కోట్లకుపైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు వివరించారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో మాదక ద్రవ్యాల ద్వారా సంపాదించిన నగదు, ఆభరణాలు ఉన్నాయని చెప్పారు. స్మగ్లర్ల బంధువులపై సైతం అభియోగాలు మోపినట్లు పేర్కొన్నారు. డ్రగ్స్ స్మగ్లర్లు బంధువులు, స్నేహితుల పేరిట ఆస్తులు కొనుగోలు చేస్తారని, వారితో సంబంధాలున్న వారిపై ఆస్తులుంటే జప్తు చేయనున్నట్లు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

