రేషన్ కార్డులో తప్పుగా అచ్చయిన పేరు.. కుక్కలా అరుస్తూ బాధితుడి నిరసన
Kutta | ఒక్కోసారి ప్రభుత్వ అధికారులు చేసే చిన్న చిన్న పొరపాట్లు సామాన్యులకు పెద్ద సమస్యలు తెచ్చిపెడతాయి. దీంతో వారి సమయం, డబ్బు వృధా అవడంతోపాటు మానసికంగా వేదన
కోల్‌కతా: ఒక్కోసారి ప్రభుత్వ అధికారులు చేసే చిన్న చిన్న పొరపాట్లు సామాన్యులకు పెద్ద సమస్యలు తెచ్చిపెడతాయి. దీంతో వారి సమయం, డబ్బు వృధా అవడంతోపాటు మానసికంగా వేదన అనుభవిస్తుంటారు. ఇలాంటిదే పశ్చిమబెంగాల్లోని బంకురా జిల్లా ఓ గ్రామంలో ఏర్పాటు చేసిన గడప గడపకూ ప్రభుత్వం అనే కార్యక్రమంలో చోటుచేసుకున్నది. రేషన్ కార్డులో తన ఇంటిపేరు దత్తాకు బదులుగా కుత్తా అని పడటంతో.. ఓ వ్యక్తి కుక్కలా మొరుగుతూ జాయింట్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ (బీడీఓ) ఎదుట నిరసన వ్యక్తంచేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
శ్రీకాంతి కుమార్ దత్తా అనే వ్యక్తి పేరును రేషన్ కార్డులో శ్రీకాంతి కుమార్ కుత్తాగా ముద్రించారు. హిందీలో కుత్తా అంటే కుక్క అని అర్థం. దీంతో తన పేరును మార్చాలని కుక్కలా అరుస్తూ అధికారికి అర్జీ పెట్టుకున్నాడు. కాగా, తన పేరు ఇలా తప్పుగా ప్రింట్ కావడం ఇది మూడోసారని శ్రీకాంతి కుమాచ్ చెప్పారు. తొలిసారి తన పేరును శ్రీకాంత మొండల్ అని రాశారని, తప్పును సరిచేయాలని దరఖాస్తు చేసుకోవడంతో దానికి శ్రీకాంతో దత్తగా మార్చారని చెప్పారు. అయితే దానిని గుర్తించిన తాను తప్పును సరిచేయాలని మరోసారి అధికారులను కోరారని చెప్పారు. దీంతో శ్రీకాంతి కుమార్ దత్తాకు బదులు కుత్తాగా టైప్చేశారని చెప్పారు. ఈనేపథ్యంలో తాను మరోసారి గడప గడపకూ ప్రభుత్వం క్యాంపునకు వచ్చానని, తన అభ్యర్థనను అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విసిగిపోయిన ఆయన ఇలా వినూత్నంగా నిరసన తెలిపి తన బాధను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
भाई का सरनेम “दत्ता” था मगर राशन कार्ड में गलती से “कुत्ता” लिखा गया! अब भाई लिखे हुए सरनेम के अनुसार अधिकारी से बात कर रहा है! 😂😂
— Prashant Kumar (@scribe_prashant) November 19, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

