న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో చురుకుగా ఉండే నాగాలాండ్ మంత్రి తెంజెన్ ఇమ్న అలంగ్ తాజాగా ట్విట్టర్లో షేర్ చేసిన ఓ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది. స్కూల్లో అందరి ఎదుట ఓ బాలుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో పాట పాడుతున్న వీడియో నెట్టింట అందరినీ ఆకట్టుకుంటోంది.
జీవితంలో ఈ మాదిరి విశ్వాసం ఉంటే చాలు అని ఈ వీడియోకు అలంగ్ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 85,000 మందికి పైగా వీక్షించారు.
Bas itna confidence chahiye life me. 😀
"ज़िन्दगी जीने के लिए नज़रो की नहीं !
नज़ारो की ज़रूरत होती है !!" pic.twitter.com/EcGrUnXtUi— Temjen Imna Along (@AlongImna) January 18, 2023
అలంగ్తో ఏకీభవించిన ట్విట్టర్ యూజర్లు బాలుడి కాన్ఫిడెన్స్ ఓ రేంజ్లో ఉందని ప్రశంసలు గుప్పించారు. బాలుడి పెర్ఫామెన్స్ అద్భుతమని ఓ యూజర్ ప్రశంసించగా, టూ గుడ్ అంటూ మరో యూజర్ రాసుకొచ్చారు.