న్యూఢిల్లీ, డిసెంబర్ 20: సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ)ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నాగాలాండ్ అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం నెప్యూ రియో మాట్లాడుతూ రాష్ర్టానికి వ్యతిరేకంగా కేంద్రం ఏఎఫ్ఎస్పీఏను విధించిందని అన్నారు. ఏఎఫ్ఎస్పీఏ రద్దు చేయాలని, ‘కల్లోలిత ప్రాంతాల’ జాబితా నుంచి నాగాలాండ్ ప్రాంతాలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం గత 20 ఏండ్లుగా సిఫారసు చేస్తున్నదని పేర్కొన్నారు.