Kangana Ranaut Slapped | మా అమ్మ కూడా రైతుల నిరసనలో పాల్గొంది.. అవమానించినందుకే కంగనా చెంపపై కొట్టా: సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్
Kangana Ranaut Slapped | తన తల్లి కూడా రైతుల నిరసనలో పాల్గొన్నదని సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ తెలిపింది. రైతులను అవమానించేలా కంగనా గతంలో స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఆమె చెంపపై కొట్టినట్లు చెప్పింది.
చండీగఢ్: తన తల్లి కూడా రైతుల నిరసనలో పాల్గొన్నదని సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ తెలిపింది. రైతులను అవమానించేలా కంగనా గతంలో స్టేట్మెంట్ ఇచ్చినందుకు ఆమె చెంపపై కొట్టినట్లు చెప్పింది. (Kangana Ranaut Slapped) నటి నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా విజయం సాధించింది. గురువారం ఢిల్లీకి బయలుదేరిన ఆమెకు చండీగఢ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. విధుల్లో ఉన్న పంజాబ్‌కు చెందిన సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్, కంగనా చెంపపై కొట్టింది. 2020లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన సందర్భంగా ట్విట్టర్లో కంగనా చేసిన పోస్ట్‌ను ఆమె గుర్తు చేసింది. రూ.100 కోసం రైతుల నిరసనలో కూర్చొన్నదంటూ ఒక మహిళ ఫొటోను కంగనా పోస్ట్ చేయడంపై నాడు విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ ట్వీట్‌ను కంగనా తొలగించింది.
కాగా, రైతులను కంగనా అవమానించినందుకే ఆమె చెంపపై కొట్టినట్లు సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ తెలిపింది. ‘రైతులు రూ.100 కోసం అక్కడ కూర్చున్నారని ఆమె (కంగనా) స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె వెళ్లి అక్కడ కూర్చుంటుందా? ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మా అమ్మ కూడా అక్కడ కూర్చుని నిరసన వ్యక్తం చేసింది’ అని రైతు కుటుంబానికి చెందిన కౌర్ అన్నది.
మరోవైపు కంగనా చెంపపై కొట్టిన సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌ను సస్పెండ్ చేశారు. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తాను సురక్షితంగానే ఉన్నానని కంగనా తెలిపింది. అయితే పంజాబ్‌లో పెరుగుతున్న ఉగ్రవాదంపై తాను ఆందోళన చెందుతున్నట్లు వీడియో సందేశంలో పేర్కొంది. దీనిని మనం ఎలా కంట్రోల్ చేయాలి? అని ప్రశ్నించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

