పరిహారం ఇవ్వాల్సిందే

- కరోనా మృతుల కుటుంబాలకు సాయంపై సుప్రీంకోర్టు
- ఎంత మొత్తం చెల్లించాలన్నది కేంద్రానిదే నిర్ణయం
- ఆరు వారాల్లోగా మార్గదర్శకాలు జారీ చేయాలి
- మరణ ధ్రువీకరణ పత్రాల జారీని సరళతరం చేయాలి
- కేంద్రాన్ని, ఎన్డీఎంఏని ఆదేశించిన ధర్మాసనం
న్యూఢిల్లీ, జూన్ 30: కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అయితే నిర్దిష్ట మొత్తం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తాము ఆదేశించలేమని, ప్రభుత్వం వద్ద ఉన్న నిధులు, వనరులు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని కేంద్రమే కనీస మొత్తాన్ని నిర్ణయించాలని సూచించింది. ఇందుకు సంబంధించి ఆరు వారాల్లోగా నూతన మార్గదర్శకాలు జారీచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని (ఎన్డీఎంఏ) ఆదేశించింది. అలాగే కరోనా మృతుల మరణ ధ్రువీకరణ పత్రాల జారీని కూడా సరళతరం చేసేలా మార్గదర్శకాలను విడుదల చేయాలని నిర్దేశించింది. తన రాజ్యాంగబద్ధ విధులను నిర్వహించడంలో ఎన్డీఎంఏ విఫలమైందని కోర్టు ఆక్షేపించింది. ఆర్థిక సంఘం ప్రతిపాదన మేరకు.. కొవిడ్ మృతులకు అంత్యక్రియలు నిర్వహించే సిబ్బందికి ఇన్సూరెన్స్ పథకాన్ని వర్తింపజేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని న్యాయవాదులు రీపక్ కన్సల్, గౌరవ్‌కుమార్ బన్సల్ దాఖలు చేసిన పిటిషన్లపై ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
రూ.4లక్షల చొప్పున చెల్లించలేం
కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించలేమని గత నెలలోనే కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడే విపత్తు నిర్వహణ చట్టం కింద పరిహారం చెల్లించడం సాధ్యమవుతుందని పేర్కొన్నది. కరోనా మృతుల కుటుంబాలన్నింటికీ రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలంటే విపత్తు నిర్వహణ నిధులన్నీ వాటికే సరిపోతాయని వివరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

