Triangle Love | ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. 500 కి.మీ. ప్రయాణించి ప్రియుడ్ని కడతేర్చింది..
Triangle Love | ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఏకంగా ఓ యువతి 500 కిలోమీటర్లు ప్రయాణించి, ఫైవ్ స్టార్ హోటల్లో తన రెండో ప్రియుడిని మొదటి ప్రియుడితో కలిసి కడతేర్చింది. ఈ దారుణ ఘటన అసోం రాజధాని గువహటిలో చోటు చేసుకుంది.
Triangle Love | ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఏకంగా ఓ యువతి 500 కిలోమీటర్లు ప్రయాణించి, ఫైవ్ స్టార్ హోటల్లో తన రెండో ప్రియుడిని మొదటి ప్రియుడితో కలిసి కడతేర్చింది. ఈ దారుణ ఘటన అసోం రాజధాని గువహటిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కోల్‌కతాకు చెందిన అంజలి షా(25) స్థానికంగా ఉన్న ఓ రెస్టారెంట్లో పని చేస్తోంది. ఆమెకు బికాష్ కుమార్ షా(23) అనే ప్రియుడు ఉన్నాడు. అయితే అంజలికి ఏడాది క్రితం పుణెకు చెందిన కారు డీలర్ కాంబ్లే పరిచయం అయ్యాడు. అయితే అంజలి, కాంబ్లే మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ శారీరకంగా కూడా దగ్గరయ్యారు. కాంబ్లేకు అంజలికి ఇదివరకే ప్రియుడు ఉన్నాడని తెలిసింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేశాడు. అంతేకాకుండా ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేశాడు.
ఇక కాంబ్లే వేధింపులు భరించలేని అంజలి.. అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకుంది. తన ప్రియుడు బికాష్తో కలిసి హత్యకు ప్లాన్ చేసింది. కోల్‌కతా రావాలని కాంబ్లేను కోరింది. తాను గువహటిలో ఉన్నానని, ఇక్కడే ఫైవ్ స్టార్ హోటల్ బుక్ చేస్తానని చెప్పాడు. చివరకు కోల్‌కతా నుంచి గువాహటికి ఫ్లైట్‌లో(500 కి.మీ.) బికాష్, అంజలి బయల్దేరారు. గువహటి ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్లో దిగారు.
కాంబ్లేకు తెలియకుండా బికాష్ కూడా అదే హోటల్లో దిగాడు. కాంబ్లే గదికి వెళ్లిన బికాష్.. అతన్ని చంపేశాడు. అనంతరం అంజలి, షా కలిసి పారిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న కాంబ్లేను చూసి హోటల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కోల్‌కతా ఫ్లైట్ బయల్దేరే ముందు అంజలి, బికాష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

