Munawar Faruqui | ముంబై హుక్కా బార్‌పై దాడి : మునావర్ ఫరూకీపై కేసు నమోదు
Munawar Faruqui : బిగ్‌బాస్ 17 విన్నర్, స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూకీని మంగళవారం రాత్రి పోలీసులు కొద్దిసేపు నిర్బంధించారు.
Munawar Faruqui : బిగ్‌బాస్ 17 విన్నర్, స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూకీని మంగళవారం రాత్రి పోలీసులు కొద్దిసేపు నిర్బంధించారు. ముంబైలోని ఓ హుక్కా బార్‌పై దాడి సందర్భంగా మునావర్ ఫరూకీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన అనంతరం ఆయనను విడిచిపెట్టారు.
ఫరూకీపై సిగరెట్స్ ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం, 2003 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఫరూకీతో పాటు మరో 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి జరిగిన సమయంలో ఫరూకీ హుక్కా బార్లో ఉన్నారు.
ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ రావడంతో కేసు నమోదు చేశారు. హుక్కా పార్లర్లో పొగాకు ఉత్పత్తుల్లో నికోటిన్ వాడుతున్నారనే సమాచారం అందడంతో పోలీసులు దాడులు చేపట్టారు. దాడుల్లో పోలీసులు రూ. 13,500 విలువైన 9 హుక్కా పాట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు.
Read More :
Saudi Arabia | మిస్ యూనివర్స్ పోటీల్లో సౌదీ అరేబియా.. ఆ దేశ చరిత్రలోనే తొలిసారి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

