లాల్బాగ్చా రాజా మళ్లీ వస్తున్నాడు.. గణేష్ ఉత్సవాలు నిర్వహించనున్న సమితి

ముంబై: ఓ భారీ సింహాసనంపై గంభీరంగా కూర్చొని ఉండే లాల్బాగ్చా రాజా గణేష్‌కు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉంది. మన ఖైరతాబాద్ వినాయకుడు ఎలాగో.. ముంబైలో ఈ లాల్బాగ్చా రాజా కూడా అంతే. 93 ఏళ్లుగా దక్షిణ ముంబైలోని లాల్బాగ్ మార్కెట్లో కొలువు దీరుతున్న ఈ గణేషుడి ఉత్సవాలు ఈసారి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలని ఉత్సవ సమితి నిర్ణయించింది. గతేడాది కరోనా కారణంగా ఈ గణేష్ ఉత్సవాలను నిర్వహించలేదు. దాని స్థానంలో 11 రోజుల పాటు రక్తం, ప్లాస్మాదాన శిబిరాన్ని ఉత్సవ కమిటీ నిర్వహించింది.
అయితే ఈసారి మాత్రం మళ్లీ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆరోగ్య పండుగగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ ఆదివారం ప్రకటించింది. అయితే ప్రతిసారీ పెట్టినట్లు భారీ గణేషున్ని కాకుండా ఈసారి మూడు నుంచి నాలుగు అడుగుల చిన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించనున్నారు. లాల్బాగ్చా రాజాను ప్రతి ఏటా లక్షల మంది భక్తులు సందర్శిస్తారు. వీళ్లలో వీఐపీలు కూడా ఉంటారు. అంతేకాదు కోట్ల కొద్దీ విరాళాలు, కేజీల కొద్దీ బంగారం, వెండీ కూడా వస్తాయి. ఈసారి గణేష్ చతుర్థి సెప్టెంబర్ 10న వస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Movies | నవంబర్లోనే సంక్రాంతి సందడి.. వరుసగా భారీ సినిమాల విడుదల, బాక్సాఫీస్ దగ్గర అసలైన పండగ!
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

