జైన ఆలయం.. కరోనా కేంద్రంగా మార్పు

ముంబై: మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళన రేపుతున్నది. ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని జైన వర్గం తమ ఆలయాల్లో ఒకదానిని కరోనా చికిత్స కేంద్రంగా మార్పు చేశారు. సాధారణ, డీలక్స్ వార్డులతో వంద పడకలు ఏర్పాటు చేశారు. పరీక్షల కోసం ల్యాబ్, ఆక్సిజన్ వ్యవస్థలు ఉన్న ఈ కరోనా చికిత్స కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. పది మంది డాక్టర్లు, 50 మంది వైద్య సిబ్బంది సేవలందించనున్నారు.
ముంబై వాసులకు ఇది కొంత ఊరటనిస్తుందని ఇక్కడ పని చేసే డాక్టర్ తన్వి తెలిపారు. గత ఏడాది కూడా ఈ జైన మందిరాన్ని కరోనా కేంద్రంగా మార్చారు. సుమారు రెండు వేల మంది కరోనా రోగులకు వైద్య చికిత్స అందజేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

