క్రిమినల్‌కు కేక్ తినిపించిన ఇన్స్పెక్టర్
క్రిమినల్‌కు కేక్| అతడో సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్. తన స్టేషన్ పరిధిలో నేరస్తుల పీచమనచాల్సిన అతడు.. కరడు గట్టిన క్రిమినల్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు. స్వయంగా ఆ నేరగానికి కేక్ తినిపించాడు.

ముంబై: అతడో సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్. తన స్టేషన్ పరిధిలో నేరస్తుల పీచమనచాల్సిన అతడు.. కరడు గట్టిన క్రిమినల్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు. స్వయంగా ఆ నేరగానికి కేక్ తినిపించాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొట్టింది. దీంతో ఆ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇదంతా మహారాష్ట్రలోని జోగేశ్వరిలో జరిగింది.
ముంబైలోని సబర్బన్ ప్రాంతమైన జోగేశ్వరి పోలీస్ స్టేషన్లో మహేంద్ర నెలీకర్ సీనియర్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. అదే స్టేషన్లో డానిష్ షేక్ అనే కరడు గట్టిన క్రిమినల్‌పై కేసులు నమోదయ్యాయి. అయితే రెండు వారాల క్రితం ఓ హౌసింగ్ సొసైటీ ఆఫీస్‌లో డానిష్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. దానికి హాజరైన ఇన్స్పెక్టర్ మహేంద్ర స్వయంగా ఆ క్రిమినల్‌కు కేకు తినిపించాడు. ఆ సందర్భంగా తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
కాగా, తానే తప్పు చేయలేదని ఇన్స్పెక్టర్ మహేంద్ర చెప్పారు. ‘హౌసింగ్ సొసైటీలో ఇళ్ల కూల్చివేత పనులు జరుగుతుండగా అక్కడికి వెళ్లాను. ఈ సందర్భంగా కొందరు సీనియర్ సిటిజన్లు తనను సొసైటీ ఆఫీస్‌కు పలిచారు. దీంతో తాను అక్కడికి పోయాను. అయితే అక్కడికి డానిష్ కూడా వస్తాడని తనకు తెలియదు. అయినా అది చాలా రోజుల క్రితం వీడియో’ అని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

