బోల్తాపడిన ట్యాంకర్లో ఇంధనం కోసం వెళ్లి ఇద్దరు దుర్మరణం.. 25 మందికి గాయాలు
Fuel Tanker | రోడ్డుపై బోల్తాపడిన ఇంధన ట్యాంకర్ నుంచి ఇంధనాన్ని తీసుకొచ్చుకునేందుకు వెళ్లి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది తీవ్రంగా
ఖర్గోన్: రోడ్డుపై బోల్తాపడిన ఇంధన ట్యాంకర్ నుంచి ఇంధనాన్ని తీసుకొచ్చుకునేందుకు వెళ్లి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఇండోర్‌కు తరలించారు. మరో 10 మంది క్షతగాత్రులు ఖర్గోన్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇవాళ ఉదయం ఆరు గంటల సమయంలో ఇండోర్ నుంచి ఖర్గోన్ వైపు వెళ్తున్న ఇంధన ట్యాంకర్ అంజన్గావ్ గ్రామం సమీపంలో మూల మలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. దాంతో సమీప గ్రామస్తులు ఇంధనాన్ని ఎత్తుకెళ్లేందుకు ఎగబడ్డారు. అదేసమయంలో ట్యాంకర్లో మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవదహనమయ్యారు.
మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

