భద్రత కోసం కుమార్తెను ఇంట్లో ఉంచి లాక్ వేసిన తల్లి.. తాళం చెవిని పొరుగు వ్యక్తికి ఇవ్వగా పలుసార్లు రేప్
తల్లి పని కోసం బయటకు వెళ్లేటప్పుడు కూతుర్ని ఇంట్లో ఉంచి లాక్ చేసేది. ఇంటి తాళాలను ఎదురింట్లో ఉండే టైలర్కు ఇచ్చేది.
ముంబై: భద్రత కోసం కుమార్తెను ఇంట్లో ఉంచిన తల్లి లాక్ వేసింది. తాళం చెవిని ఎదురింటి వ్యక్తికి ఇవ్వగా ఆ యువతిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని థానే నగరంలో ఈ దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 17 ఏళ్ల బాలికపై ఆమె తండ్రి మూడు నెలల కిందట లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో భర్తపై పోలీసులకు భార్య ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన తర్వాత నుంచి కుమార్తె భద్రత కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నది. పని కోసం బయటకు వెళ్లేటప్పుడు కూతుర్ని ఇంట్లో ఉంచి లాక్ చేసేది. ఇంటి తాళాన్ని ఎదురింట్లో ఉండే టైలర్కు ఇచ్చేది.
కాగా, డిసెంబర్లో దుస్తులను సరి చేయించుకునేందుకు ఆ టైలర్ ఇంటికి యువతి వెళ్లగా ఆమెపై తొలిసారి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక తల్లి పనికి వెళ్లినప్పుడు ఆమెను బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. అయితే జనవరి 14న అతడి చేష్టలను రహస్యంగా మొబైల్లో ఆమె రికార్డ్ చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ధైర్యం చేయలేదు.
మరోవైపు గురువారం ఆ వ్యక్తి బాలికను బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్తుండగా పొరుగున ఉండే మరో మహిళ చూసి అడ్డుకుంది. దీంతో ధైర్యం చేసిన ఆ బాలిక అతడి లైంగిక దాడుల గురించి ఆమెకు చెప్పింది. అలాగే ఆమె రికార్డ్ చేసిన వీడియోను కూడా చూపించింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ టైలర్పై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

