ఈడీ సీజ్ చేసిన డబ్బు అంతా ఐఏఎస్ పూజాదే..
రాంచీ: జార్ఖండ్‌లో నరేగా నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆ రాష్ట్ర మైన్స్ శాఖ కార్యదర్శి ఐఏఎస్ పూజా సింఘాల్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టు అయిన ఆ అధికారి చార్టెడ్ అకౌంటెంట్ కుమార్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మే 7వ తేదీన సుమన్ కుమార్ ఇంటి నుంచి 17 కోట్ల డబ్బును ఈడీ స్వాధీనం చేసుకున్నది. ఈ అంశంలో ఈడీ విచారణ చేపట్టింది. సుమన్ కుమార్ తన వాంగ్మూలంలో ఆ డబ్బు అంతా పూజా సింఘాల్దే అని చెప్పాడు. తన ఇంటి నుంచి సీజ్ చేసిన సొమ్ము ఎక్కువ శాతం పూజదే అన్నాడు. ఐఏఎస్ పూజ ఇచ్చిన ఆదేశాల మేరకు ఓ ప్రఖ్యాత బిల్డర్‌కు మూడు కోట్లు ఇచ్చినట్లు ఆ అకౌంటెంట్ విచారణలో తెలిపాడు. రాంచీలోని పల్స్ హాస్పిటల్ భూమిని ఆ డబ్బుతో ఖరీదు చేసినట్లు తెలుస్తోంది. పల్స్ సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్ నిర్మాణంలో పూజ కీలక పాత్ర పోషించిందని, ఆ హాస్పిటల్ నిర్మాణం కోసం పేమెంట్స్ అన్నీ నగదు రూపంలో ఇచ్చినట్లు అకౌంటెంట్ వెల్లడించాడు. ఈ నేపథ్యంలో ఐఏఎస్ సింఘాల్ మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని ఈడీ కోర్టులో చెప్పింది. మైన్స్ శాఖలో కార్యదర్శిగా ఉన్న పూజను మే 11వ తేదీన అరెస్టు చేశారు. 12న ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

