స్పుత్నిక్-వీ మరికొంత ఆలస్యం

సీడీఎల్ నుంచి అనుమతులు రాకపోవడమే కారణం
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): స్పుత్నిక్-వీ టీకా అందుబాటులోకి రావడానికి మరో రెండు వారాలు సమయం పట్టనున్నట్టు రెడ్డీస్‌ల్యాబ్ వర్గాలు తెలిపాయి. రష్యా నుంచి ఇప్పటివరకు సుమారు 30 లక్షల డోసులు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. గత నెల 14 నుంచే వ్యాక్సిన్ పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ నెల రెండోవారంలో బహిరంగ మార్కెట్లోకి విడుదలచేయాలని భావించారు. టీకాలను పరీక్షల నిమిత్తం కసౌలిలోని సెంట్రల్ డ్రగ్స్ లేబోరేటరీ (సీడీఎల్)కి పంపించారు. రెండువారాలుగా ఎదురుచూస్తున్నా ఇప్పటికీ అనుమతులు రాలేదు. దీంతో టీకాల విడుదల కార్యక్రమాన్ని వాయిదావేస్తున్నట్టు రెడ్డీస్‌ల్యాబ్ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 28 నగరాల్లో టీకాలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఇప్పటికే కోల్డ్‌స్టోరేజీలను, సైప్లెచెయిన్ను సిద్ధంచేసినట్టు వివరించారు. దేశీయంగా టీకాలను ఉత్పత్తిచేసి మొత్తం 25 కోట్ల డోసులను సరఫరా చేసేందుకు రెడ్డీస్‌ల్యాబ్ రష్యాతో ఒప్పందం చేసుకున్నది. తయారీ ఆలస్యం అవుతుండటం, కరోనా విజృంభిస్తుండటంతో 50 లక్షల డోసులను నేరుగా దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే మూడు దశల్లో సుమారు 30 లక్షల డోసులు వచ్చాయి. మిగతావి ఈ నెలాఖరుకు లేదా జూలై మొదటివారంలో వస్తాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

