ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో నోటాకు 57 వేలకుపైగా ఓట్లు
NOTA | ఢిల్లీలో అధికార పార్టీ మరోసారి సత్తా చాటింది. ఈ నెల 4న జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించిన చీపురుపార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నది.
న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికార పార్టీ మరోసారి సత్తా చాటింది. ఈ నెల 4న జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించిన చీపురుపార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నది. ఎంసీడీలోని మొత్తం 250 సీట్లకుగాను ఆప్ 134 సీట్లు గెలుపొందింది. రాజధాని నగరంలో 15 ఏండ్లపాటు చక్రం తిప్పిన బీజేపీని 104 వార్డులకే పరిమితం చేసింది. అయితే ఇక్కడ మరో విషయం గురించి కూడా చెప్పుకోవాలి. గత ఆదివారం జరిగిన పోలింగ్‌లో అర లక్షకుపైగా ఓట్లు నోటా గుర్తుకు పడ్డాయి. అంటే తమకు ఏ అభ్యర్థి నచ్చలేదని ఓటర్లు స్పష్టం చేయడం విశేషం.
ఢిల్లీలో మొత్తం 1,45,05,358 ఓటర్లు ఉన్నారు. వారిలో 78,93,418 పురుషులు, 66,10,879 మంది మహిళలు, 1,061 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఎంసీడీ ఎన్నిలకల్లో 50.48 శాతం మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 57,545 మంది నోటాకు ఓటేశారు. అంటే 0.78 శాతం మంది అన్నమాట.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AAP
- BJP
- Delhi Civic Body Polls
- MCD
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

