మోర్బీ బ్రిడ్జి ఆధునీకరణకు రూ.2 కోట్లు.. ఖర్చు చేసింది 12 లక్షలే
Morbi bridge | గుజరాత్‌లోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగల వంతెన మరమ్మతుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని
అహ్మదాబాద్: గుజరాత్‌లోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగల వంతెన మరమ్మతుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించిన విషయం తెలిసిందే. అయితే బ్రిడ్జి ఆధునీకరణకు ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించగా.. నిర్వహణ సంస్థ అయిన ఒరేవా గ్రూప్ అందులో రూ.12 లక్షలు మాత్రమే ఖర్చుచేసినట్లు తెలుస్తున్నది. అంటే కేటాయించిన మొత్తంలో కేవలం 6 శాతం నిధులను వినియోగించిందని విచారణలో వెల్లడైంది. తూతూ మంత్రంగా పనిచేసి తీగలకు రంగులేసి, మార్బుల్స్‌ను పాలిష్ చేసి మరమ్మతులు పూర్తయినట్లుగా చూపించారని తెలిసింది.

దాదాపు 143 ఏళ్లనాటి సస్పెన్షన్ బ్రిడ్జి ఆధునీకరణ పనులు పూర్తయ్యాయని, పర్యాటకుల కోసం తిరిగి తెరచుకోచ్చని ఒరేవా గ్రూప్ చైర్మన్ జైకుష్ పటేల్ గత నెల 24న ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి భద్రతా పరమైన అనుమతులు లేకుండా నిర్వహణ సంస్థ పర్యాటకులను బ్రిడ్జిపైకి పర్యటకులను అనుమతించింది. ఈ క్రమంలో గత నెల 30న తీగల వంతెన కుప్పకూలడంతో 135 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 100 మందికిపైగా గాయపడ్డారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

