అగ్నిపథ్‌తో ఆర్మీ ప్రైవేటీకరణ!
మోదీ ప్రభుత్వం ‘అగ్నిపథ్'తో భారత ఆర్మీని ప్రైవేటీకరించాలని చూస్తున్నదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. వ్యవసాయ చట్టాలతో రైతులను కార్పొరేట్ చేతుల్లో పెట్టాలని చూసిన కేంద్రం.. ఇప్పుడు ఆర్మీని కూడా ప్రైవేటీకరించాలని కుట్ర చేస్తున్నదని విమర్శించారు
ఇప్పటికే గుజరాత్లో ప్రైవేట్ పోలీసులు
ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రైవేట్ వాళ్లే
చాలా రంగాలు పెట్టుబడిదారుల చేతుల్లో
బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ విమర్శ
న్యూఢిల్లీ, జూన్ 26: మోదీ ప్రభుత్వం ‘అగ్నిపథ్’తో భారత ఆర్మీని ప్రైవేటీకరించాలని చూస్తున్నదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. వ్యవసాయ చట్టాలతో రైతులను కార్పొరేట్ చేతుల్లో పెట్టాలని చూసిన కేంద్రం.. ఇప్పుడు ఆర్మీని కూడా ప్రైవేటీకరించాలని కుట్ర చేస్తున్నదని విమర్శించారు. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా అగ్నిపథ్‌ను వ్యతిరేకించటానికి కారణాలను, డిమాండ్లను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
- అగ్నిపథ్ ఒక మిలిటరీ వ్యతిరేక, రైతు వ్యతిరేక, దేశ వ్యతిరేక పథకం. ఆర్మీలో చేరే యువకులంతా రైతు బిడ్డలు, కూలీల బిడ్డలే. అంటే మన వాళ్లే. ఎవరూ నాలుగేండ్లకే రిటైర్ అవ్వరు. అదీ యువకుడిగా ఉన్నప్పుడే రిటైర్ అవ్వాల్సిందేనని ఒత్తిడి చేస్తే ఎవరూ ఒప్పుకోరు.
- అగ్నిపథ్‌లో ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు? 25 శాతం మందిని తీసుకొంటామని చెప్పారు.. ఏ ప్రాతిపదికన వాళ్లను సెలెక్ట్ చేస్తారు? నాలుగేండ్ల తర్వాత ఇంటికి వచ్చే అభ్యర్థికి ‘రిటైర్ అయ్యాడు’ అనే సర్టిఫికెట్ ఏమైనా జారీ చేస్తారా?
- అగ్నిపథ్‌కు బదులుగా 18 ఏండ్లు నిండిన ప్రతీ ఒక్కరికి ఏడాది పాటు మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వాలి. అలా కాకుండా.. నాలుగేండ్ల పాటు శారీరకంగా, మానసికంగా హింసించి తర్వాత వదిలేస్తామంటే ఎలా? అగ్నిపథ్ రిక్రూట్మెంట్ విధానం ఏంటో తెలపాలనే మేము జిల్లా కలెక్టర్లకు మెమోరాండం సమర్పించాం.
- ఇప్పటికే గుజరాత్లో పోలీస్ వ్యవస్థను ప్రైవేటీకరించారు. అక్కడ ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థ కూడా ప్రైవేటుదే. ఇప్పుడు ఆర్మీని ప్రైవేటీకరించాలని మోదీ సర్కారు కుట్ర చేస్తున్నది. ‘అగ్నిపథ్’ స్కీమ్ అందులో భాగమే.
- (అగ్నిపథ్ అల్లర్లపై స్పందిస్తూ..) ఆందోళనలేవీ వాటంతట అవే అల్లర్లుగా మారవు. ప్రభుత్వం ప్రేరేపించటం వల్లే ఇలా జరుగుతాయి. దాదాపు ఆర్మీలో చేరే యువకులు పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ నుంచి వచ్చినవాళ్లే. ఆ జవాన్లు అందరూ రైతుల కొడుకులే. వాళ్లు అసలైన దేశ భక్తులు. అందుకే అగ్నిపథ్ లాంటి అంశాల్లో సున్నితంగా ఉంటారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Agnipath
- army
- Centre
- farmer leader
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

