3 రెట్లు పెరిగిన 500, 2000 నోట్ల చెలామణి
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత దేశంలో రూ.500, రూ.2000 నోట్ల చెలామణి మూడు రెట్లు పెరిగింది. బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ సోమవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు బదులిచ్చారు.
- బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్
- ప్రశ్నకు ఆర్థిక మంత్రి సమాధానం
న్యూఢిల్లీ, మార్చి 20: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత దేశంలో రూ.500, రూ.2000 నోట్ల చెలామణి మూడు రెట్లు పెరిగింది. బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ సోమవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు బదులిచ్చారు. 2017లో రూ.9.412 లక్షల కోట్ల విలువైన రూ.500, రూ.2000 నోట్లు చెలామణిలో ఉండగా, 2022 మార్చి నాటికి రూ.27.057 లక్షల కోట్లకు పెరిగినట్టు చెప్పారు. నోట్ల రద్దు తర్వాత రూ.9.21 లక్షల కోట్ల విలువైన 500, 2000 రూపాయల నోట్లు చెలామణిలోకి వచ్చాయని, అయితే అవి బ్లాక్ మనీగా మారిపోయాయా?, 2000 నోట్లను ఏటీఎంలో ఉంచొద్దని, బ్యాంకుల్లో వినియోగదారులకు ఇవ్వవద్దంటూ ఏమైనా ఆదేశాలు జారీ అయ్యాయా? అని ఎంపీ సంతోష్ కుమార్ ప్రశ్నించారు. దానికి ఆర్థిక మంత్రి బదులిస్తూ.. 2000 నోట్లు ఏటీఎంల్లో ఉంచొద్దని, బ్యాంకుల ద్వారా సరఫరా చేయవద్దంటూ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదన్నారు. బ్యాంకులు తమకు అనుకూలంగా కావాల్సిన డినామినేషన్లలో నోట్లను ఏటీఎంలలో పెట్టవచ్చన్నారు. 2019-20 నుంచి 2000 నోట్ల ముద్రణకు ఆర్బీఐ నుంచి ఎలాంటి ఇండెంట్ రాలేదని మంత్రి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Doodimetla Balaraj Yadav | కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ.. దూదిమెట్లకు బెయిల్ మంజూరు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు పొరుగింటి కుర్రాడితో ఎఫైర్.. చివరకు రైలు కింద ఇద్దరూ మృతి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

