Bangle Seller: గాజులు అమ్మేవాడిని చితక్కొట్టారు.. ఎందుకంటే

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గాజులు అమ్మే ( Bangle Seller ) ఓ ముస్లిం వ్యక్తిని కొందరు చితకబాదారు. ఈ ఘటన పట్టణంలోని బన్గంగా ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకున్నది. గాజులు అమ్మే వ్యక్తిపై దాడి చేసి అతని వద్ద నుంచి పదివేల లాక్కెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటన పట్ల దర్యాప్తు చేపడుతున్నట్లు ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. తన వ్యాపారాన్ని నడుపుకునేందుకు ఆ బాధిత వ్యక్తి నకిలీ పేరును వాడుతున్నట్లు మంత్రి తెలిపారు. తస్లీమ్ అనే వ్యక్తిని చితకబాదిన వీడియో ఆదివారం వైరల్ అయ్యింది. ఈ ఘటనలో పోలీసులు దాడి, దొంతగతనం కేసు నమోదు చేశారు. అయితే దాడికి గురైన ముస్లిం వ్యక్తి.. హిందూ పేరుతో వ్యాపారం సాగిస్తున్నాడని, అతని వద్ద రెండు రకాల ఆధార్ కార్డులు ఉన్నాయని మంత్రి నరోత్తమ్ తెలిపారు. ఈ ఘటన పట్ల సోషల్ మీడియాలో రియాక్ట్ కావొద్దు అని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. గాజుల వ్యాపారిపై దాడి చేసిన వారిని వీడియో ద్వారా గుర్తించామని ఇండోర్ ఎస్పీ అశుతోష్ బాగ్రి తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

