Watch: కదులుతున్న రైలు పక్కగా యువకుడ్ని ఈడ్చిన ఆకతాయిలు.. వీడియో వైరల్
Miscreants Drag Youth | ఆకతాయిలు రెచ్చిపోయారు. ఒక యువకుడి చొక్కా కాలర్ పట్టుకున్నారు. కదులుతున్న రైలు పక్కగా ప్లాట్‌ఫారమ్‌పై అతడ్ని ఈడ్చారు. ఆ యువకుడు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
భోపాల్: ఆకతాయిలు రెచ్చిపోయారు. ఒక యువకుడి చొక్కా కాలర్ పట్టుకున్నారు. కదులుతున్న రైలు పక్కగా ప్లాట్‌ఫారమ్‌పై అతడ్ని ఈడ్చారు. (Miscreants Drag Youth) ఆ యువకుడు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. బుధవారం మధ్యాహ్నం భోపాల్ రైల్వే స్టేషన్ నుంచి కుషినగర్ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరింది. ఇద్దరు వ్యక్తులు ఒక యువకుడిపై దాడి చేశారు. కంపార్ట్మెంట్ డోర్ వద్ద ఉన్న ఒక వ్యక్తి ఆ యువకుడి కాలర్ పట్టుకున్నాడు. కదులుతున్న రైలు పక్కగా ప్లాట్‌ఫారమ్‌పై అతడ్ని ఈడ్చాడు. ఫ్లాట్‌ఫారమ్ పై పరుగెత్తిన మరో వ్యక్తి దీనికి సహకరించాడు. రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య గ్యాప్ నుంచి పట్టాలపై ఆ యువకుడ్ని తోసేందుకు ప్రయత్నించారు. రైలు వేగం అందుకోవడంతో ఆ వ్యక్తులు చివరకు యువకుడ్ని విడిచిపెట్టారు. దీంతో ప్రమాదం నుంచి అతడు బయటపడ్డాడు.
కాగా, భోపాల్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్ 2పై ఈ సంఘటన జరిగింది. ఇది చూసి అక్కడున్న ప్రయాణికులు షాక్ అయ్యారు. ‘భోపాల్ హైలైట్స్’ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆకతాయిలు ప్రమాదకరంగా యువకుడ్ని రైలు నుంచి ఈడ్చడంపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

