Karnataka shocker: మొబైల్ ఫోన్ కొనిస్తామని నమ్మించి.. బాలికపై యువకులు సామూహిక లైంగిక దాడి
Karnataka shocker | సాగర్ అనే యువకుడు తనకు తెలిసిన 17 ఏళ్ల బాలికను స్నేహితుడైన దేవరాజ్‌కు పరిచయం చేశాడు. దీంతో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ కొనిస్తానని దేవరాజ్ ఆ బాలికతో చెప్పాడు. ఈ సాకుతో సిటీకి ఆమెను రప్పించాడు.
బెంగళూరు: మొబైల్ ఫోన్ కొనిస్తామని నమ్మించి బాలికను సిటీకి రప్పించిన కొందరు యువకులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధిత బాలిక ఫిర్యాదుతో నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని హుబ్బలి జిల్లాలో (Karnataka shocker) ఈ సంఘటన జరిగింది. సాగర్ అనే యువకుడు తనకు తెలిసిన 17 ఏళ్ల బాలికను స్నేహితుడైన దేవరాజ్‌కు పరిచయం చేశాడు. దీంతో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ కొనిస్తానని దేవరాజ్ ఆ బాలికతో చెప్పాడు. ఈ సాకుతో హుబ్బలికి ఆమెను రప్పించాడు.
కాగా, హుబ్బలికి వచ్చిన బాలికను ఒక చోటుకు తీసుకెళ్లారు. అనంతరం నలుగురు యువకులు కలిసి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధిత బాలిక దీనిపై హుబ్బలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నలుగురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై సామూహిక లైంగిక దాడి జరిగినట్లు బాలిక చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

