జమ్మూ వైమానిక స్థావరంపై దాడి కేసు.. ఎన్ఐఏకు అప్పగింత
జమ్మూ వైమానిక స్థావరం | జమ్మూలో వైమానిక స్థావరంపై దాడి కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ ( NIA ) కు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ

న్యూఢిల్లీ : జమ్మూలో వైమానిక స్థావరంపై దాడి కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ ( NIA ) కు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీన జమ్మూ వైమానిక స్థావరంపై బాంబు దాడి జరిగిన విషయం విదితమే. ఉగ్రవాదులు డ్రోన్లతో వైమానిక స్థావరంపై బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు.
జమ్మూ విమానాశ్రయంలోని వాయుసేన కార్యకలాపాలు నిర్వహించే స్థావరంలో పేలుడు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. శనివారం అర్ధరాత్రి దాటాక 1.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. తక్కువ ఎత్తులో ఎగురుతూ వచ్చిన రెండు డ్రోన్లు ఆరు నిమిషాల వ్యవధిలో వాయుసేన స్థావరం మీదకు పేలుడు పదార్థాలను (ఐఈడీ) జారవిడిచినట్టు అధికారులు తెలిపారు. తొలి బాంబు దాడిలో సత్వారీ ఏరియాలోని హై-సెక్యూరిటీ టెక్నికల్ ఏరియాలోని ఒక బిల్డింగ్ పైకప్పు దెబ్బతినగా, రెండో పేలుడు బహిరంగ ప్రదేశంలో జరిగినట్టు చెప్పారు. ఈ ఘటనలో ఇద్దరు వాయుసేన అధికారులు స్వల్పంగా గాయపడ్డట్టు చెప్పారు.
జమ్ములోని కల్చుక్ ప్రాంతంలో ఉన్న సైనిక స్థావరంపై ఆదివారం అర్ధరాత్రి రెండు డ్రోన్లు అనుమానాస్పదంగా కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన బలగాలు వాటిపైకి 25 రౌండ్ల వరకు కాల్పులు జరిపారు. రాత్రి 11.45 గంటలు, 2.40 గంటల సమయంలో ఈ డ్రోన్లు కనిపించినట్టు అధికారులు తెలిపారు. జమ్ములో వాయుసేన స్థావరంపై దాడి జరిగిన 24 గంటల్లోనే మరోసారి డ్రోన్లు సైనిక స్థావరం మీదకు రావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది.
2002లో కూడా ఇదే స్థావరంపై ఉగ్రదాడి జరిగింది. అప్పుడు 10 మంది పిల్లలు సహా 31 మంది చనిపోయారు. కాగా, జమ్ములోని వాయుసేన స్థావరంపై రెండు డ్రోన్లతో దాడి జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. ఆరు నిమిషాల వ్యవధిలో ఈ పేలుళ్లు జరిగాయి. ఒక్కో డ్రోన్ 2 కిలోల చొప్పున శక్తిమంతమైన ఐఈడీలను మోసుకొచ్చాయి. జైషే మహ్మద్ ఈ దాడి వెనుక ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

