నా ట్విట్టర్ అకౌంట్ పనిచేయలేదు : కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్

న్యూఢిల్లీ: కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇవాళ తన ట్విట్టర్ అకౌంట్‌ను యాక్సెస్ చేయలేకపోయారు. తన అకౌంట్ ఒక గంట పాటు తాత్కాలికంగా పనిచేయలేదని మంత్రి తెలిపారు. ఆ సమయంలో ఆయన ఎటువంటి ఫోటోలను కానీ, వీడియోలను కానీ పోస్టు చేయలేకపోయారు. టీవీ చర్చలకు సంబంధించిన వీడియోలను పోస్టు చేయడం వల్ల.. ఆ పోస్టులు కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిన ఆరోపణలపై తన ట్విట్టర్ ఖాతా పనిచేయలేదని మంత్రి వెల్లడించారు. ఇటీవల కొత్త ఐటీ రూల్స్ తెచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌కు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే మంత్రి అకౌంట్ మాత్రం నెట్ యూజర్లకు కనిపించింది. కానీ మంత్రి అకౌంట్లోకి లాగిన్ కావడానికి లేదా పోస్టు చేయడానికి మాత్రం యాక్సెస్ దొరకలేదు. కాంటెంట్ పోస్టు చేస్తున్న సమయంలో డిజిటల్ మిలీనియమ్ కాపీరైట్ యాక్ట్ నోటీసు వచ్చినట్లు మంత్రి తెలిపారు. అయితే ట్విట్టర్ చర్యలను మంత్రి ఖండిచారు. ఐటీ చట్టంలోని రూల్ 4(8)ను ఉల్లంఘించినట్లు అవుతుందని ఆయన ఆరోపించారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా తన అకౌంట్‌కు యాక్సెస్ ఇవ్వలేదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

