Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
Rajnath Singh : పాకిస్తాన్ వైపు నుంచి మరోసారి ఇండియాలో ఎలాంటి తీవ్రవాద దాడి జరిగినా ఇకపై తీవ్రంగా స్పందిస్తామని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు.
Rajnath Singh : పాకిస్తాన్ వైపు నుంచి మరోసారి ఇండియాలో ఎలాంటి తీవ్రవాద దాడి జరిగినా ఇకపై తీవ్రంగా స్పందిస్తామని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఈ మేరకు పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. న్యూఢిల్లీలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీవ్రవాదాన్ని అణచివేసే చర్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
సరిహద్దు తీవ్రవాదాన్ని అణచివేయడంలో ఇండియా రాజీపడబోదని మరోసారి పునరుద్ఘాటించారు. శాంతి, ద్వైపాక్షిక చర్చలకు ఇండియా ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, అంతమాత్రాన దాన్ని ఇండియా బలహీనతగా భావించవద్దన్నారు. ‘‘తీవ్రవాదంపై భారత్ స్పందించే విధానంలో నిర్ణయాత్మక మార్పు వచ్చింది. భారత్కు పొంచి ఉన్న ముప్పును మూలాల నుంచి తొలగించే చర్యలు తీసుకుంటున్నాం. ఆపరేషన్ సిందూర్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ వంటి సైనిక చర్యలే ఇందుకు ఉదాహరణలు. ద్వైపాక్షికంగా దాడుల్ని ఖండించే స్థాయి నుంచి గట్టి బదులిచ్చే చర్యలకు దిగుతున్నాం. తీవ్రవాదాన్ని మూలాల నుంచి అంతం చేస్తున్నాం.
ఇండియాకు వ్యతిరేకంగా ఉగ్రకార్యకలాపాలకు పాల్పడిన వారిని సగటున ఏడాదిలో అంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. శాంతి నెలకొనాలి అంటే సైనికంగా బలోపేతం కావాలి. సైనిక చర్యలకు సిద్ధంగా ఉండాలి. ఎదురయ్యే ముప్పును తిప్పికొట్టాలి. డిజిటల్ టెక్నాలజీతోపాటు సంప్రదాయేతర భద్రతా ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా 5డీ భద్రతా ముప్పు ఉంది. అది.. తప్పుడు సమాచారం, అస్థిరత, అంతరాయం కలిగించడం, మోసం, విధ్వంసం’’ అని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ఆపన్నుడికి లయన్స్ క్లబ్ నోబుల్ ఆపన్నహస్తం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

