Global Microsoft Cloud Outage | మ్యాన్యువల్ బ్యాకప్ సిస్టమ్‌తో పరిస్ధితి చక్కదిద్దుతాం : రామ్మోహన్ నాయుడు
Global Microsoft Cloud Outage : మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవల్లో అంతరాయంతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్స్‌లో ఊహించని రీతిలో జాప్యం జరుగుతున్నదని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.
Global Microsoft Cloud Outage : మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవల్లో అంతరాయంతో దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్స్‌లో ఊహించని రీతిలో జాప్యం జరుగుతున్నదని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా ఎయిర్‌పోర్ట్‌ల్లో అదనపు సీట్లు, మంచినీటి వసతి, ఆహారం సమకూర్చాలని ఎయిర్పోర్ట్ అధికారులు, ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించామని మంత్రి పేర్కొన్నారు.
ప్రయాణీకుల ఇబ్బందులు అర్ధం చేసుకున్నామని, పాసింజర్లు వీలైనంత త్వరగా సురక్షితంగా ప్రయాణాలు పూర్తిచేసుకునేలా శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ప్రయాణీకులు సంయమనంతో, ఓపికతో సహకరించిన తీరు ప్రశంసనీయమని అన్నారు. మ్యాన్యువల్ బ్యాకప్ సిస్టమ్స్ ద్వారా పరిస్ధితిని కొంతమేర చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి తెలిపారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం ఏర్పడింది. పలు కంప్యూటర్లలో విండోస్-11, విండోస్-10 ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది.
ప్రధానంగా మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్‌తో నడిచే కంప్యూటర్లు, లాప్‌టాప్‌లలో బ్లూ స్క్రీన్ ఎర్రర్ రావడంతో పలు సేవలు నిలిచిపోయాయి. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాతో పలు దేశాల్లో ఈ సమస్య ఉత్పన్నమైంది. ఈ ఎర్రర్ కారణంగా అంతర్జాతీయ స్థాయిలో విమానాలు, బ్యాంకులు, స్టోరేజీ మీడియా సేవలకు అంతరాయం కలుగుతున్నది. ఈ క్రమంలో భారత్‌లో విమాన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. ఇండిగో, స్పైస్‌జెట్, విస్తారా, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్‌లైన్స్ సేవలు స్తంభించాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే, స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నిలిచిపోయింది.
Read More :
Air India Flight: రష్యాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. మరో విమానాన్ని పంపిస్తున్న ఎయిర్ ఇండియా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

