ఉర్దూ భాషాభివృద్ధికి సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారు: మంత్రి కొప్పుల ఈశ్వర్
రాష్ట్రంలో శాంతి,సామరస్యాలను కాపాడేందుకు,ముస్లింల భద్రత సంక్షేమం,అభ్యున్నతికి ముఖ్యమంత్రి కెసిఆర్

రాష్ట్రంలో శాంతి,సామరస్యాలను కాపాడేందుకు,ముస్లింల భద్రత సంక్షేమం,అభ్యున్నతికి ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నారని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల వారికి నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు,ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు.జనవరి 6వ తేదీన గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసే “ఫస్ట్ ఉర్దూ జాబ్ ఫెయిర్ ఆఫ్ తెలంగాణ”బ్రోచర్ ను శనివారం మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఉర్దూ భాషాభివృద్ధికి, వికాసానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు.కెసిఆర్ ఉర్దూ భాషాభిమాని అని, తెలుగు, ఇంగ్లీషులతో సహ ఉర్దూలో కూడా అనర్గళంగా మాట్లాడుతారని వివరించారు.ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించడాన్ని, మంత్రుల పేషీల్లో ఉర్దూ ఆఫీసర్లను నియమించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఉర్దూ అకాడమీ, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం,సెట్విన్, యూత్ అడ్వాన్స్ మెంట్ కమిటీ, హైదరాబాద్ వీకర్స్ సెక్షన్ డెవలప్ మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీల ఆధ్వర్యంలో జరిగే ఈ మొట్టమొదటి జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవలసిందిగా కొప్పుల ఈశ్వర్ యువతను కోరారు.ఈ సందర్భంగా ఉర్దూ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ మహ్మద్ గౌస్ మాట్లాడుతూ,పెద్ద ఎత్తున జరిగే ఈ మేళాలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలోని టెక్నికల్,నాన్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు.పదవ తరగతి నుంచి పిజి,ఐటిఐ, డిప్లొమా, ప్రభుత్వ అనుమతి పొందిన మదర్సాలలో చదువుకున్న 18 నుంచి 35 ఏళ్ల వయసు కలిగిన యువత పాల్గొనవచ్చని తెలిపారు.మరిన్ని వివరాలకు jobmelaurdumanuusesetwin@gmail.com.సంప్రదించవలసిందిగా కోరారు.కార్యక్రమంలో మహ్మద్ యూసఫ్ ఖాన్ ( మౌలానా ఆజాద్ యూనివర్సిటీ), డాక్టర్ సయ్యద్ అస్గర్ మహ్మద్ ( అడ్వాన్స్ మెంట్ కమిటీ), చంద్రమౌళి (సెట్విన్ ),సెరికల్చర్ మాజీ అధికారి డాక్టర్ ఖాద్రీ, ప్రముఖ న్యాయవాది వలీ ఉర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- koppula eshwar
- Urdu
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

