న్యూఢిల్లీ : వారం ఆరంభంలో చికాకులను మటుమాయం చేసేలా క్రేజీ వీడియో (viral video) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. హుషారైన తమిళ పాటలకు కొచ్చి మెట్రో సిబ్బంది స్టైలిష్ మూమెంట్స్‌తో కూడిన వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.
ఈ వైరల్ క్లిప్‌లను కొచ్చి మెట్రో రైల్ అధికారిక పేజ్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. తొలి క్లిప్‌లో కొచ్చి మెట్రోలో పనిచేసే యువతీ, యువకుడు దసరా మూవీ నుంచి మైనారు వెట్టి కట్టి సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోలో మహిళ నవ్వులు రువ్వుతుండగా, వ్యక్తి క్రేజీ స్టెప్స్ ఆకట్టుకున్నాయి. ఈ వీడియో నెట్టింట షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 31,000కుపైగా వ్యూస్ లభించాయి. మరో వీడియోలో కొచ్చి మెట్రోలో పనిచేసే ఇద్దరు మహిళలు హుషారైన డ్యాన్స్ మూమెంట్స్‌తో హోరెత్తించారు.
Read More
Bahuda Bridge | ఇచ్ఛాపురంలో కూలిపోయిన బహుదా బ్రిడ్జి.. వీడియో