Kerala: హీటెక్కిన కేరళ.. 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్
Kerala : కేరళ హీటెక్కింది. సమ్మర్ వేడి దంచుతోంది. ఇవాళ ఐఎండీ ఆరు జిల్లాలకు వార్నింగ్ ఇచ్చింది. టెంపరేచర్లు అధిక స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఎర్నాకుళం, త్రిసూర్, కన్నూరు, అలప్పుజా, కొట్టాయం, కోజికోడ్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
తిరువనంతపురం: కేరళ(Kerala)లో ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరిగాయి. దీంతో ఆ రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆరు జిల్లాలకు ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఎర్నాకుళం, త్రిసూర్, కన్నూరు, అలప్పుజా, కొట్టాయం, కోజికోడ్ జిల్లాల్లో సోమ, మంగళ వారాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు ఐఎండీ వెల్లడించింది. అలర్ట్ ప్రకారం ఎర్నాకుళం, త్రిసూర్, కన్నూరు జిల్లాల్లో అత్యధికంగా 37 డిగ్రీల టెంపరేచర్ నమోదు కానున్నది. ఇక అలప్పుజా, కొట్టాయం, కోజికోడ్ జిల్లాల్లో 36 డిగ్రీలు నమోదు కానున్నట్లు ఐఎండీ తెలిపింది. సాధారణ స్థాయి కన్నా.. సుమారు 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు ఆ జిల్లాల్లో నమోదు కానున్నట్లు ఐఎండీ తన అలర్ట్‌లో పేర్కొన్నది. నిజానికి మార్చి నుంచి జూన్ మధ్య కాలంలో కేరళలో అధిక ఉష్ణోగ్రతలే ఉంటాయి. కానీ ఈసారి ఫిబ్రవరిలోనే వెదర్ వేడెక్కినట్లు తెలుస్తోంది. వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు తగిన చర్యలు తీసుకోవాలని కేరళ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వేడుకల్లో మార్పులు.. నవంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్!
Hyderabad | హైదరాబాద్‌లో జలగలు.. అక్రమ బోర్లతో యథేచ్ఛగా ట్యాంకర్లతో నీటి వ్యాపారం!
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

