Menstrual Leaves | రుతుక్రమ సెలవుల అంశంపై ‘సుప్రీం’లో విచారణ..!
Menstrual Leaves | రుతుక్రమ సెలవుల అంశంపై సుప్రీంకోర్టులో సోమవారం చర్చ జరిగింది. ఈ అంశంపై రాష్ట్రాలను సంప్రదించి రుతుక్రమ సెలవుపై నమూనా విధానాన్ని రూపొందించాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Menstrual Leaves | రుతుక్రమ సెలవుల అంశంపై సుప్రీంకోర్టులో సోమవారం చర్చ జరిగింది. ఈ అంశంపై రాష్ట్రాలను సంప్రదించి రుతుక్రమ సెలవుపై నమూనా విధానాన్ని రూపొందించాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రుతుక్రమ సెలవుల అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది కోర్టులు పరిశీలించాల్సిన అంశం కాదని పేర్కొంది. సెలవులు ఇవ్వాలని నిర్ణయిస్తే మహిళలపై వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. సెలవులను తప్పనిసరి చేస్తే కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వకుండా పోయే అవకాశం ఉందని.. ఫలితంగా మహిళలు శ్రామికశక్తికి దూరమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ఇది ప్రభుత్వ విధానపరమైన అంశమని.. దీన్ని కోర్టులు పరిశీలించాల్సిన అవసరం లేదని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థినులు, ఉద్యోగులకు రుక్రమం సమయంలో నెలవారీ సెలవులు మంజూరు చేసేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. 2023 మేలో ఇచ్చిన రిప్రజంటేషన్పై ఇప్పటి వరకు స్పందన లేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అయితే, కేంద్ర స్త్రీ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి, అదనపు సొలిసిటర్ జనరల్ (ASG) ఐశ్యర్య భాటి ఎదుట హాజరయ్యేందుకు పిటిషనర్‌కు అనుమతి ఇచ్చింది.
ఈ అంశంపై విధాన స్థాయిలో పరిశీలించి.. రాష్ట్రాలను సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కేంద్ర కార్యదర్శికి కోర్టు సూచించింది. అలాగే, రుతుక్రమ సెలవుపై ఆదర్శవంతమైన పాలసీని రూపొందించగలరేమో చూడాలని అని పేర్కొంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టు ఇదే వైఖరిని స్పష్టం చేసింది. మహిళా విద్యార్థినులు, ఉద్యోగులకు రుతుక్రమ సెలవులు కల్పించేలా అన్ని రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తిరస్కరించింది. ఇది విధానపరమైన అంశమని తెలిపింది. అయితే, బీహార్, కేరళ రెండు రాష్ట్రాలు మాత్రమే రుతుక్రమ సెలవులు ఇస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, బీహార్‌లో మహిళా ఉద్యోగులకు రెండు రోజులు, కేరళలో విద్యార్థినులకు మూడు రోజుల రుతుక్రమ సెలవులు ఇస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

