Attack on ambulance driver | చిన్నారికి అత్యవసర చికిత్స కోసం వేగంగా వెళ్తున్న అంబులెన్స్.. అడ్డగించి డ్రైవర్‌పై దాడి
Attack on ambulance driver | చిన్నారికి అత్యవసర చికిత్స కోసం వేగంగా వెళ్తున్న అంబులెన్స్ ఒక వాహనాన్ని ఓవర్ టేక్ చేసింది. దీంతో ఆ కారులో ఉన్న వ్యక్తులు అంబులెన్స్‌ను ఫాలో అయ్యారు. టోల్‌ప్లాజా వద్ద అడ్డుకున్నారు. అంబులెన్స్ డ్రైవర్‌ను కొట్టారు. పసిపాపను ఎమర్జెన్సీగా ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని, వదిలిపెట్టాలని తల్లిదండ్రులు మొరపెట్టుకున్నప్పటికీ వారు కనికరించలేదు.
బెంగళూరు: చిన్నారికి అత్యవసర చికిత్స కోసం వేగంగా వెళ్తున్న అంబులెన్స్ ఒక వాహనాన్ని ఓవర్ టేక్ చేసింది. దీంతో ఆ కారులో ఉన్న వ్యక్తులు అంబులెన్స్‌ను ఫాలో అయ్యారు. టోల్‌ప్లాజా వద్ద అడ్డుకున్నారు. అంబులెన్స్ డ్రైవర్‌ను కొట్టారు. (attack on ambulance driver) పసిపాపను ఎమర్జెన్సీగా ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని, వదిలిపెట్టాలని తల్లిదండ్రులు మొరపెట్టుకున్నప్పటికీ వారు కనికరించలేదు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఐదు నెలల పసి పాపను ఆక్సిజన్ సపోర్ట్‌తో తుమకూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి బెంగళూరులోని వాణి విలాస్ హాస్పిటల్‌కు అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. చిన్నారికి అత్యవసర వైద్యం అవసరం కావడంతో డ్రైవర్ జాన్ అంబులెన్స్‌ను వేగంగా నడిపాడు. ఈ క్రమంలో ఇన్నోవా కారును ఓవర్టేక్ చేశాడు.
కాగా, ఆ కారులో ఉన్న వ్యక్తులు తమ వాహనాన్ని ఓవర్టేక్ చేయడంపై ఆగ్రహించారు. సుమారు ఆరు కిలోమీటర్ల వరకు అంబులెన్స్‌ను అనుసరించారు. నెలమంగళ టోల్ ప్లాజా వద్ద అంబులెన్స్‌ను ఓవర్టేక్ చేసి అడ్డుకున్నారు. అంబులెన్స్ డ్రైవర్‌ను కొట్టారు. తమ పాప పరిస్థితి సీరియస్‌గా ఉందని అంబులెన్స్ వెళ్లేందుకు అనుమతించాలని చిన్నారి పేరెంట్స్ చేతులు జోడించి వారిని వేడుకున్నారు. అయినప్పటికీ పట్టించుకోని ఆ వ్యక్తులు అంబులెన్స్ డ్రైవర్‌పై దాడిని కొనసాగించారు. చివరకు పోలీసుల జోక్యంతో అంబులెన్స్‌ను విడిచిపెట్టారు.
మరోవైపు ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న కొందరు వ్యక్తులు ఈ సంఘటనను తమ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశారు. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. అంబులెన్స్ డ్రైవర్‌పై దాడి చేసిన నలుగురిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో వారు మద్యం సేవించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

