Puducherry BJP worker | బైకులపై వచ్చి బాంబులు విసిరి.. పుదుచ్చేరి బీజేపీ నేతను నరికి చంపిన దుండగులు
Puducherry BJP worker | హోంమంత్రి ఏ నమశ్శివాయం బంధువైన 45 ఏళ్ల సెంథిల్ కుమార్, ఆదివారం రాత్రి 9 గంటలకు రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక బేకరీ వద్ద నిల్చొని ఉన్నాడు. ఇంతలో ఏడుగురు వ్యక్తులు బైకులపై అక్కడకు వచ్చి ఆయనను చుట్టుముట్టారు.
పుదుచ్చేరి: కొందరు దుండగులు బైకులపై వచ్చారు. నాటు బాంబులు విసిరి హంగామా సృష్టించారు. అనంతరం బీజేపీ నేతను (Puducherry BJP worker) నరికి చంపారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఈ సంఘటన జరిగింది. హోంమంత్రి ఏ నమశ్శివాయం బంధువైన 45 ఏళ్ల సెంథిల్ కుమార్, ఆదివారం రాత్రి 9 గంటలకు కనువపేటైలోని రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక బేకరీ వద్ద నిల్చొని ఉన్నాడు. ఇంతలో ఏడుగురు వ్యక్తులు బైకులపై అక్కడకు వచ్చి ఆయనను చుట్టుముట్టారు. ఒక వ్యక్తి రెండు నాటు బాంబులు విసిరాడు. దీంతో సెంథిల్ కుమార్ కుప్పకూలిపోయాడు. ఆ దుండగులు ఆయన వద్దకు వచ్చి కర్రలతో దాడి చేశారు. కత్తులతో నరికి చంపారు. అనంతరం బైకులపై అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు సెంథిల్ కుమార్ హత్య విషయం తెలిసిన వెంటనే హోంమంత్రి ఏ నమశ్శివాయం, బంధువులు, సుమారు700 మంది బీజేపీ కార్యకర్తలు ఆ ప్రాంతానికి వచ్చారు. చనిపోయిన సెంథిల్‌ను చూసి హోంమంత్రి నమశ్శివాయం, బంధువులు బోరున ఏడ్చారు. పోలీసులు కూడా వెంటనే అక్కడకు చేరుకున్నారు. సెంథిల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్య జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
पुदुचेरी में हमलावरों ने की भाजपा नेता की हत्या। हमलावरों ने सेंथिल कुमार पर देशी बम फेंके और बाद में चाकू मारकर मार डाला।#puducherry #BJP pic.twitter.com/kyHBTFJr3p
— Pranjal (@Pranjaltweets_) March 27, 2023
Also Read:
BS Yediyurappa | బీజేపీ నేత యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి
Tejashwi Yadav | లాలూ ఇంట సందడి వాతావరణం.. తండ్రైన తేజస్వీ యాదవ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

