Online Gaming | ఆన్లైన్ గేమింగ్‌పై కొత్త మార్గదర్శకాలు.. మే 1 నుంచి అమలుకు ఆదేశం
Online Gaming : దేశంలో ఆన్లైన్ గేమింగ్ ఆడేవారి కోసం కేంద్రం కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది. గేమ్స్ ఆడేవారికి మేలు కలిగేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తాజాగా కొత్త రూల్స్‌పై మార్గదర్శకాలు విడుదల చేసింది.
Online Gaming : దేశంలో ఆన్లైన్ గేమింగ్ ఆడేవారి కోసం కేంద్రం కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది. గేమ్స్ ఆడేవారికి మేలు కలిగేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తాజాగా కొత్త రూల్స్‌పై మార్గదర్శకాలు విడుదల చేసింది. వచ్చే మే 1 నుంచి ఈ కొత్త రూల్స్ అమలుకాబోతున్నాయి. దేశంలో ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ చాలా పెద్దది. స్మార్ట్‌ఫోన్స్, ఇంటర్నెట్ డాటా తక్కువ ధరలో అందుబాటులో ఉండటం వంటి కారణాలతో చాలా మంది గేమింగ్వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల కొందరు ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు.
అయితే, ఇకపై గేమింగ్ విషయంలో కంపెనీలు కొన్ని రూల్స్ తప్పనిసరిగా ఫాలో కావాల్సిందే. సాధారణ, సోషల్ గేమ్స్‌కు సంబంధించి ఇకపై ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్స్ అవసరం లేదు. అయితే, అది ఈ స్పోర్ట్స్ అయినా.. లేదా.. కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక గ్రూప్‌నకు సంబంధించిన గేమ్స్ అయినప్పుడు మాత్రం రిజిస్ట్రేషన్ అవసరం. ఈ నిర్ణయం మొబైల్ గేమింగ్ స్టార్టప్స్‌కు, చిన్న డెవలపర్లకు మేలు చేస్తుంది. ఎక్కువ డాక్యుమెంట్లు వంటివి అవసరం లేకుండానే తమ గేమ్స్‌ను మార్కెట్లోకి తీసుకురావొచ్చు. మనీ సంబంధిత గేమ్స్, ఎక్కువ మంది కలిసి ఆడే గేమ్స్, హై రిస్క్ ఉన్న టైటిల్స్, అన్ని రకాల ఈ స్పోర్ట్ సంస్థలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఇప్పటికి ప్రత్యేక కేటగిరి అంటూ లేదు. కానీ, త్వరలోనే వీటిని కేటగిరిలుగా విభజిస్తారు. కొత్త రూల్స్ ప్లేయర్స్‌కు మరింత మేలు చేస్తాయి. వారికి మరింత భద్రత కల్పిస్తాయి. ఆటగాళ్ల ఫిర్యాదులకు కంపెనీలు ప్రాధాన్యమివ్వాలి.
అలాగే, సైబర్ సెక్యూరిటీ, సేఫ్ పేమెంట్ మానిటరింగ్, రెగ్యులర్ రిపోర్టింగ్ వంటి వాటికి అవకాశం ఇవ్వాలి. ఈ రూల్స్ వల్ల మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడే వారు మరింత సులభంగా, భద్రంగా గేమ్స్ ఆడుకోవచ్చు. ఇక, ఈ గేమ్స్, నిబంధనల్ని పర్యవేక్షించేందుకు కేంద్రం తాజాగా ఆన్లైన్ గేమింగ్ అథారిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇందులో ఫైనాన్స్, బ్రాడ్‌కాస్టింగ్, హెల్త్, స్పోర్ట్స్, పవర్, జస్టిస్, విదేశీ వ్యవహారాల శాఖలకు చెందిన ప్రతినిధులు ఉంటారు. వీరు.. ఆన్లైన్ గేమింగ్ సంస్థల రిజిస్ట్రేషన్స్, ఫిర్యాదులు, భద్రత వంటి అంశాల్ని పర్యవేక్షిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Protests | సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో మళ్లీ మొదలైన ఆందోళనలు.. పలువురు అరెస్ట్
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

