Charu Pandey | కోచింగ్ లేకుండా 23 ఏళ్లకే 19 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన చారుపాండే.. రాష్ట్రపతి నుంచి ఆహ్వానం
Charu Pandey : ఏదైనా ఒక్క ప్రభుత్వం ఉద్యోగం సాధించాలనేది దేశంలోని కోట్లాది మంది అభ్యర్థుల కల. అందులో విజయం సాధించేది చాలా తక్కువ. అదీ ఒక్క ఉద్యోగం సంపాదించడమే చాలా గొప్ప. అలాంటిది ఒక యువతి ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది.
Charu Pandey : ఏదైనా ఒక్క ప్రభుత్వం ఉద్యోగం సాధించాలనేది దేశంలోని కోట్లాది మంది అభ్యర్థుల కల. అందులో విజయం సాధించేది చాలా తక్కువ. అదీ ఒక్క ఉద్యోగం సంపాదించడమే చాలా గొప్ప. అలాంటిది ఒక యువతి ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. అందులోనూ దేనీకీ కోచింగ్ తీసుకోకపోవడం ఇంకో విశేషం. ఇలా అరుదైన ఘనత సాధించిన యువతి పేరు చారు పాండే. ఆమె సొంతూరు ఛత్తీస్‌గడ్‌లోని తిల్దా నియోరా ప్రాంతం.
ప్రస్తుతం ఆమె కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విభాగంలో అసిస్టెంట్ ఆడిటర్‌గా పని చేస్తున్నారు. మ్యాథమెటిక్స్‌లో గ్రాడ్యుయేట్ చేసిన చారు పాండే.. కాలేజీలో చదువుతున్నప్పటినుంచే కాంపిటీటీవ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేరయ్యేది. అలాగని, వాటికోసం ఏ కోచింగ్ సెంటర్లో కూడా చేరలేదు. యూట్యూబ్‌లో అందుబాటులో ఉండే వీడియోలు చూస్తూ పరీక్షలకు సిద్దమైంది. రోజూ 20 గంటల్ని చదువుకు అనుగుణంగా ప్లాన్ చేసుకునేది. అలా ఇప్పటివరకు తను అటెండ్ చేసిన అనేక ఉద్యోగాల్ని దక్కించుకుంది. మొత్తం 19 ఉద్యోగాలకు ఎంపికైంది. 23 ఏళ్ల వయసుకే 19 ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్తల ఉద్యోగాలు దక్కించుకుంది.
ఆమె సాధించిన విజయాల్ని గుర్తించిన రాష్ట్రపతి కార్యాలయం వచ్చే ఆగష్టు 15, స్వాతంత్ర్య దినోత్సవం రోజున నిర్వహించనున్న ‘ఎట్ హోం’ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. దేశంలోని స్ఫూర్తిదాయకమైన యువత విభాగంలో చారు పాండేకు ఆహ్వానం దక్కింది. అతి చిన్న వయసులో అత్యధిక ఉద్యోగాలకు ఎంపికై, దేశంలోని యువతకు చారు పాండే ఆదర్శంగా నిలిచారు. తాను 19 ఉద్యోగాల్ని సాధిస్తానని అనుకోలేదని, ఒక ప్రభుత్వ ఉద్యోగం సాదిస్తే చాలని భావించానని చారు పాండే అన్నారు.
తాను ఒక ఉద్యోగం కోసం దానికి సంబంధించిన సిలబస్ పూర్తి చేయడానికి వంద శాతం కష్టపడతానని ఆమె తెలిపింది. చారు పాండే సాధించిన ఉద్యోగాలివి. ఎస్ఎస్సీ (సీజీఎల్), ఎస్ఎస్సీ (సీహెచ్ఎస్ఎల్), ఎస్ఎస్సీ (ఎంటీఎస్), ఎస్ఎస్సీ (జీడీ), ఎస్ఎస్సీ (సీపీవో), ఐబీపీఎస్ పీవో, ఐబీపీఎస్ క్లర్క్, ఎస్బీఐ పీవో, ఎస్బీఐ క్లర్క్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ గ్రూప్ డీ, సీజీ ఎస్ఐ, ఢిల్లీ పోలీస్, సీజీ ఎన్హెచ్ఎం, ట్రాన్స్పోర్ట్ ఎస్ఐ, ఎస్ఎస్సీ (సీజీఎల్) 2023, ఎస్ఎస్సీ (సీహెచ్ఎస్ఎల్ 2023), ఎస్ఎస్సీ (ఎంటీఎస్) 2023, ఆర్ఆర్బీ గ్రూప్ డి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyber Crime | సైబర్ నేరాలకు కాంగ్రెస్ నేత మ్యూల్ ఖాతా!.. ప్రధాన నిందితుడు వెంకటేశ్ సహా నలుగురి అరెస్టు
YTPS | వైటీపీఎస్‌లో సీఈపై సస్పెన్షన్ వేటు.. రద్దు చేయాలని ఉద్యోగుల జేఏసీ వినతి
Congress | కాంగ్రెస్ నేత దౌర్జన్యం.. సంక్షేమ సంఘం కార్యదర్శిపై బూతుపురాణం
Smriti Mandhana | మంధాన శకంలో మొదటి అంకం.. నేడు జింబాబ్వేతో భారత్ తొలి టీ20
Jio Internet | జియోతో ఇంటర్నెట్ చౌక.. 6G సేవలపై ఎండీ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

