Medha Patkar | పరువు నష్టం కేసులో దోషిగా మేధాపాట్కర్.. తీర్పును జూలై 1కి రిజర్వ్ చేసిన ఢిల్లీ కోర్టు
Medha Patkar | పరువు నష్టం కేసులో దోషిగా తేలిన నర్మదా బచావో ఆందోళన్ (NBA) ఉద్యమకారిణి మేధా పాట్కర్ (Medha Patkar) కేసులో తీర్పును ఢిల్లీలోని సాకేత్ కోర్టు జూలై 1కి రిజర్వ్ చేసింది. ఈ కేసులో జూలై 1న తీర్పు వెల్లడించనున్నట్లు తెలిపింది. ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) చైర్మన్ వీకే సక్సేనా మేధా పాట్కర్‌పై పరువు నష్టం దావా వేశారు.
Medha Patkar : పరువు నష్టం కేసులో దోషిగా తేలిన నర్మదా బచావో ఆందోళన్ (NBA) ఉద్యమకారిణి మేధా పాట్కర్ (Medha Patkar) కేసులో తీర్పును ఢిల్లీలోని సాకేత్ కోర్టు జూలై 1కి రిజర్వ్ చేసింది. ఈ కేసులో జూలై 1న తీర్పు వెల్లడించనున్నట్లు తెలిపింది. ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) చైర్మన్ వీకే సక్సేనా మేధా పాట్కర్‌పై పరువు నష్టం దావా వేశారు.
ఈ కేసులో మేధా పాట్కర్‌ను దోషిగా తేలుస్తూ మే 24న సంచలన తీర్పు వెలువరించింది. అయితే శిక్షపై మే 30 వరకు వాదనలు విన్నది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయస్థానం శిక్ష ఖరారును మాత్రం జూలై 1కి రిజర్వ్ చేసింది. కాగా పాట్కర్, సక్సేనా మధ్య 2000 సంవత్సరం నుంచి చట్టసంబంధ పోరాటం కొనసాగుతూ వస్తున్నది.
నర్మదా బచావో ఆందోళన్‌కు వ్యతిరేకంగా, తనకు వ్యతిరేకంగా వీకే సక్సేనా ప్రచార ప్రకటనలు ఇచ్చారని 2000 సంవత్సరంలో మేధాపాట్కర్ దావా వేయడంతో వారి మధ్య వివాదం మొదలైంది. సక్సేనా అప్పుడు అహ్మదాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్’కు అధిపతిగా ఉన్నారు.
మేధాపాట్కర్ దావా నేపథ్యంలో వీకే సక్సేనా ఆమెపై రెండు దావాలు వేశారు. మేధా పాట్కర్ తన గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఒక దావా, టీవీ ఛానెల్లో తన పరువుకు నష్టం కలిగించే ప్రకటన ఇచ్చారని మరో దావా వేశారు. ఈ నేపథ్యంలో పరువు నష్టం కేసులో మేధా పాట్కర్‌ను ఢిల్లీలోని సాకేత్ కోర్టు ఈ నెల 24న దోషిగా ప్రకటించింది. ఇవాళ శిక్షను జూలై 1కి రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

