అసోంలో భారీ అగ్నిప్రమాదం.. 150 దుకాణాలు దగ్ధం
అసోంలోని జోర్హాట్ జిల్లాలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జోర్హాట్ పట్టణంలో ఉన్న చౌక్ బజార్‌లోని ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
జోర్హాట్: అసోంలోని జోర్హాట్ జిల్లాలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జోర్హాట్ పట్టణంలో ఉన్న చౌక్ బజార్‌లోని ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్కన ఉన్న షాపులకు విస్తరించడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో మొత్తం 150 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ ప్రాంతం మొత్తం దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంధి ఘటనా స్థలానికి చేరుకున్నారు. 25 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపుచేయడానికి శ్రమిస్తున్నారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్లే మంటలు అంటుకున్నట్లు ప్రాథమికంగా అంచనావేస్తున్నారు.
కాగా, మంటలు వేగంగా మార్కెట్ మొత్తానికి విస్తరించాయని అధికారులు తెలిపారు. దీంతో షాపులన్నీ మంటల్లో కాలిపోయాయని, భారీగా ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు. అయితే షాపులు మూసేసిన తర్వాత ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని వెల్లడించారు. కాలిపోయిన వాటిలో ఎక్కువగా బట్టలు, నిత్యావసరాలకు చెందిన దుకాణాలే ఉన్నాయని వెల్లడించారు. మంటలను అదుపుచేయడానికి జోర్హాట్ సమీపంలో ఉన్న పట్టణాల నుంచి ఫైర్ ఇంజిన్లను రప్పిస్తున్నామన్నారు. అయితే రోడ్లు ఇరుకుగా ఉండటంతో ఘటనా స్థలానికి చేరుకోవడానికి సమయం పట్టిందన్నారు. జోర్హాట్లో రెండు నెలల కాలంలో భారీ అగ్నిప్రమాదం జరగడం ఇది రెండోసారి పోలీసులు తెలిపారు. గతేడాది డిసెంబర్లో మర్వారీ పట్టీ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో పలు దుకాణాలు దగ్ధమయ్యాయని చెప్పారు.
#WATCH | Assam: Fire breaks out at Jorhat's Chowk Bazaar. Several fire tenders have reached the spot. The fire started at a cloth shop near the main gate of the market. Further details awaited. pic.twitter.com/5nG48kDiVq
— ANI (@ANI) February 16, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Assam
- Chowk Bazar
- Jorhat
- market
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

