దుర్గామాతకు మాస్క్

- భక్తులకు ప్రసాదంగా మాస్కులు
- యూపీలో ఓ పూజారి వినూత్న యత్నం
ఎటాహ్ (ఉత్తర్ప్రదేశ్): అది ఉత్తర్ప్రదేశ్ ఇటావా ప్రాంతంలోని దుర్గామాతా ఆలయం. అక్కడకు వస్తున్న భక్తులంతా అమ్మవారి దర్శనం సమయంలో ఆశ్చర్యానికి గురవుతున్నారు. దుర్గామాత విగ్రహం ఫొటోలు తీసుకుంటున్నారు. ఇవి సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. దుర్గామాత విగ్రహానికి మాస్కు ఉండటమే దీనికి కారణం. దేశంలో కరోనా రెండోదశ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలను మాస్కు ధరించేలా చైతన్యపరిచేందుకు ఓ అడుగు ముందుకేశారు ఆ ఆలయ పూజారి పండిట్ మనోజ్శర్మ. చైత్రనవరాత్రుల్లో రెండోరోజయిన బుధవారం విగ్రహ రూపంలోని దుర్గామాతాకు మాస్కు ఏర్పాటుచేశారు. ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాదంగా మాస్కులను బహూకరించారు. గుడిలో శానిటైటజర్లను ఏర్పాటుచేయడంతోపాటు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- durga matha
- mask
- Temple
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

