eVITARA: ఎలక్ట్రిక్ కారు ఈ-విటారాను ఆవిష్కరించిన మారుతీ సుజుకీ
eVITARA: మారుతీ సుజుకీ నుంచి ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది. తొలి బ్యాటరీ కారు ఈ-విటారాను ఇవాళ ఆ కంపెనీ లాంచ్ చేసింది. ఢిల్లీలో జరిగిన ఈమెంట్లో ఆ కారును ప్రదర్శించారు. వంద దేశాలకు ఆ కారును ఎగమతి చేయనున్నట్లు కంపెనీ చెప్పింది.
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ ఇవాళ ఎలక్ట్రిక్ కారు ఈ-విటారా(eVITARA)ను ఆవిష్కరించింది. తొలిసారి మారుతీ కంపెనీ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేసింది. ఈ కారును సుమారు వంద దేశాలకు ఎగుమతి చేయనున్నది. ఢిల్లీలోని భారత్ మొబిలిటీ ఆటో షోలో ఈ-విటారా మోడల్‌ను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో సుజుకీ మోటారు ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకీ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ ఎస్యూవీ మోడల్‌ను.. యురోప్,జపాన్‌తో పాటు వేర్వేరు ప్రాంతాలకు ఎగుమతి చేయనున్నట్లు చెప్పారు.
మారుతీ సుజుకీ ఇండియా కంపెనీలో 58 శాతం వాటా సుజుకీ మోటార్ కార్పొరేషన్‌కు ఉన్నది. అయితే ఈ మోడల్ కార్ల ఉత్పత్తి కోసం ఇండియాను హబ్‌గా మార్చుకోవాలని ఆ కంపెనీ భావిస్తున్నది. గుజరాత్‌లోని మారుతీ సుజుకీ ప్లాంట్‌లో ఈ-విటారా కార్లను ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ-విటారాలో రెండు బ్యాటరీల ఆప్షన్ కల్పించారు. 49kWh , 61kWh బ్యాటరీలు దీంట్లో ఉంటాయి. సింగిల్ ఛార్జ్‌తో ఇది సుమారు 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.
E Vitara is here!! #evitara pic.twitter.com/FrJlIQNFKX
— Somnath Chatterjee (@SomChaterji) January 17, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

