Man Kills Live In Partner | సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన వ్యక్తి.. అగ్నిప్రమాదంలో మరణించినట్లు నమ్మించే యత్నం
Man Kills Live In Partner | సహజీవనం చేస్తున్న మహిళను ఒక వ్యక్తి హత్య చేశాడు. అగ్నిప్రమాదంలో ఆమె కాలి మరణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే దర్యాప్తు చేసిన పోలీసులు అసలు గుట్టును రట్టు చేశారు.
చండీగఢ్: సహజీవనం చేస్తున్న మహిళను ఒక వ్యక్తి హత్య చేశాడు. (Man Kills Live In Partner) అగ్నిప్రమాదంలో ఆమె కాలి మరణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే దర్యాప్తు చేసిన పోలీసులు అసలు గుట్టును రట్టు చేశారు. హర్యానాలోని సోనిపట్‌లో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 25న సివిల్ లైన్స్ ఏరియాలోని రిషి కాలనీలో నివసిస్తున్న సరిత ఇంట్లో మంటలు వ్యాపించాయి. కాలిన ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా ఆమెను కత్తితో పొడిచి చంపి శరీరానికి నిప్పంటించినట్లు తేలింది.
కాగా, మృతురాలు సరిత సోదరుడి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్ననాటి స్నేహితురాలైన ఆమెతో ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్న వ్యాపారి ఉప్కార్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
మరోవైపు భర్త నుంచి సరిత విడిపోవడంతో వివాహితుడైన ఉప్కార్ ఆమెతో కలిసి ఒక ఇంట్లో నివసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ విషయం అతడి భార్యకు కూడా తెలుసని అన్నారు. అయితే కుటుంబ కలహాల వల్ల సరితను కత్తితో పొడిచి హత్య చేశాడని, ఆ తర్వాత ఆమె శరీరానికి నిప్పుపెట్టాడని చెప్పారు. ఆ మంటల్లో ఇల్లు కాలిపోవడం వల్ల ఆమె చనిపోయినట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడని పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

