Maoist Ananth | లొంగిపోయిన మావోయిస్టు అనంత్ టీమ్.. లేఖ విడుదల చేసిన 24 గంటల్లోనే సరెండర్
Maoist Ananth | మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ (ఎంఎంసీ) స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
Maoist Ananth | మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ (ఎంఎంసీ) స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. 10 మంది మావోయిస్టులతో కలిసి ఆయన మహారాష్ట్ర లోని గోండియా జిల్లా దారేక్ష పోలీస్స్టేషన్లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఐదు రాష్ర్టాల్లో ఆయనపై రూ కోటి రివార్డు ఉంది. లొంగిపోయిన వారిలో ఐదుగురు మావోయిస్టులు ఉన్నారు.
జనవరి 1వ తేదీన లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని తాజాగా అనంత్ ఒక లేఖను విడుదల చేశారు. ఆ లేఖ విడుదల చేసిన 24 గంటలు తిరగకముందే ఆయన పోలీసులకు లొంగిపోవడం గమనార్హం. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ లేఖ విడుదల చేసిన తరువాత వరుసగా ఆడియో సందేశాలను విడుదల చేశారు. అందులో.. ‘మారుతున్న పరిస్థితులను పరిశీలించి పార్టీ తాతాలికంగా సాయుధ పోరాటాన్ని నిలిపివేసి, ప్రధాన స్రవంతిలోకి వచ్చి ప్రజల్లో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం ప్రకారం సోనుదాదా, సతీశ్దాదా, చంద్రన్నతోపాటు మరెందరో సహచరులు ఆయుధాలను వదిలి, ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస పథకాన్ని అంగీకరించారు. అందుకే ఇది లొంగిపోవడం కాదు. ఇది విప్లవానికి, ప్రజలకు ద్రోహం చేయడం ఏమాత్రమూ కాదు. ప్రజల సమస్యలను మరోవిధంగా ముందుకు తీసుకెళ్దాం.
సాయుధ పోరాటాన్ని కొనసాగించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. మనం ఎందరో సహచరులను కోల్పోయాం. ఇంకా ఎవరినీ కోల్పోవాలని కోరుకోవడం లేదు. అందుకే మీరు ఎకడున్నా సాయుధ పోరాటాన్ని తాతాలికంగా నిలిపివేయాలనే నిర్ణయానికి వెంటనే రావాలి. ఒకరినొకరు సంప్రదించడానికి ప్రయత్నించాలి. మనమంతా కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం మంచిది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర అంత సమయం లేదు. చర్చలు, వాదోపవాదాలకు చాలా సమయం ఉంది. ముందుగా మనం అందరం బతికి ఉండాలి. ఈ క్లిష్ట సమయంలో సహనం కోల్పోవద్దు. ప్రతి ఒకరూ ఒంటరిగా లొంగిపోవద్దు. మనమందరం కలిసి చేస్తున్న పని ఇది’ అంటూ ముగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

