Amazon employees | ఆఫీసులకు రమ్మంటే రాజీనామా చేస్తాం : అమెజాన్ ఉద్యోగులు
రిమోట్ వర్కింగ్‌కు స్వస్తిపలకడంతో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు (Amazon employees) ఉద్యోగులు గుడ్‌బై చెబుతున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తితో వర్క్ ఫ్రం హోం, రిమోట్ వర్కింగ్లకు మళ్లిన కంపెనీలు తిరిగి ఉద్యోగులను కార్యాలయాలకు రప్పిస్తున్నాయి.
న్యూయార్క్ : రిమోట్ వర్కింగ్‌కు స్వస్తిపలకడంతో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు (Amazon employees) ఉద్యోగులు గుడ్‌బై చెబుతున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తితో వర్క్ ఫ్రం హోం, రిమోట్ వర్కింగ్లకు మళ్లిన కంపెనీలు తిరిగి ఉద్యోగులను కార్యాలయాలకు రప్పిస్తున్నాయి. ఈ క్రమంలో వారానికి కనీసం మూడురోజులు కార్యాలయాల నుంచి పనిచేయాలని అమెజాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగులను కోరింది. వ్యాపారం మెరుగుపడుతుందనే వ్యూహంతో కంపెనీ మే నుంచి ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తోంది.
అయితే ఈ మార్పును జీర్ణించుకోలేని ఉద్యోగులు కంపెనీ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసులకు విధిగా రావాలనే ఆదేశాలను వ్యతిరేకిస్తూ దాదాపు 2000 మంది ఉద్యోగులు అప్పట్లో నిరసన తెలిపారు. ఇక ఉద్యోగుల కోసం సిద్ధం చేసిన భవనం సిద్ధమైనా పలువురు ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులకు రావడం లేదని ఆయా ఉద్యోగులకు రెండు రోజుల కిందట కంపెనీ నుంచి ఈ మెయిల్ వచ్చింది. తమ టీం సభ్యులతో కలిసి కార్యాలయాలకు విధిగా హాజరు కావాలని కంపెనీ ఆయా టీంలను కోరుతోందని సమాచారం.
ఇక తాజా ఆదేశాలపై అమెజాన్ ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఆఫీసులకు హాజరు కావాలని జారీ చేసిన తాజా ఉత్తర్వులపై పలువురు ఉద్యోగులు పెదవివిరిచారు. రిమోట్ వర్కింగ్‌ను నిలిపివేస్ఏ తాము ఉద్యోగాలను వదులుకునేందుకు సిద్ధమని చెబుతున్నారు. మరికొందరు ఉద్యోగులు తమను రిమోట్ రోల్స్‌లో హైర్ చేశారని తాము ఆఫీసులకు రాలేమని తేల్చిచెబుతున్నారు. మరోవైపు రిమోట్ వర్కర్లు వచ్చే ఏడాది ప్రధమార్ధానికి ఆఫీసులకు రావాలని కంపెనీ కోరుతోందని సమాచారం.
Read More :
California | భార్యపై కోపంతో బార్లో కాల్పులకు తెగబడ్డ వ్యక్తి.. ఐదుగురు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

