Manish Sisodia | మనీష్ సిసోడియాకు మూడురోజులు బెయిల్..!
Manish Sisodia | ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు దాదాపు ఏడాది తర్వాత ఊరట కలిగింది. మూడు రోజుల పాటు జైలు నుంచి బయటకు రానున్నారు. మేనకోడలి పెళ్లికి హాజరయ్యేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు బెయిల్‌ను ఇచ్చింది.
Manish Sisodia | ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు దాదాపు ఏడాది తర్వాత ఊరట కలిగింది. మూడు రోజుల పాటు జైలు నుంచి బయటకు రానున్నారు. మేనకోడలి పెళ్లికి హాజరయ్యేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు బెయిల్‌ను ఇచ్చింది. వివాహ వేడుకకు హాజరయ్యేందుకు లక్నో వెళ్లాల్సి ఉండగా.. ఈ నెల 13 నుంచి 15 వరకు బెయిల్‌ను మంజూరు చేసింది. అయితే, బెయిల్ పిటిషన్‌పై వ్యతిరేకంగా వాదనలు వినిపించినా.. కోర్టు బెయిల్‌ను ఇచ్చింది.
ఇంతకు ముందు ఆయనకు వారాని ఒకరోజు అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను కలిసేందుకు అవకాశం కల్పించింది. ఆయన భార్య సీమా సిసోడియా గత 23 సంవత్సరాలుగా న్యూరో సంబంధిత వ్యాధి మల్టిపుల్ స్ల్కెరోసిస్తో బాధపడుతున్నారు. ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి. దాంతో క్రమంగా శరీరంపై నియంత్రణ కోల్పోతుంది. మనీష్ సిసోడియా అరెస్టు తర్వాత సీమా సిసోడియా ఇంట్లో ఒంటరిగా ఉండడం, ఒత్తిడి కారణంగా ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీష్ సిసోడియాను ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. ఆ తర్వాత సీబీఐ ఎఫ్ఐఆర్పై ఈడీ మార్చి 9న మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసింది. ఫిబ్రవరి 28న ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

