Manipur insurgent group UNLF | మణిపూర్ తిరుగుబాటు గ్రూప్ యూఎన్ఎల్ఎఫ్, కేంద్రం మధ్య.. శాంతి ఒప్పందం
Manipur insurgent group UNLF | మణిపూర్‌లోని తిరుగుబాటు గ్రూపు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యూఎన్ఎల్ఎఫ్), (Manipur insurgent group UNLF) కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వం మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఆరు దశాబ్దాలుగా కొనసాగిన సాయుధ ఉద్యమానికి ఆ మిలిటెంట్ సంస్థ ముగింపు పలికింది. ఆయుధాలు అప్పగించడంతోపాటు శాంతి ఒప్పందంపై సంతకం చేసింది.
ఇంఫాల్: మణిపూర్‌లోని తిరుగుబాటు గ్రూపు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యూఎన్ఎల్ఎఫ్), (Manipur insurgent group UNLF) కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వం మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఆరు దశాబ్దాలుగా కొనసాగిన సాయుధ ఉద్యమానికి ఆ మిలిటెంట్ సంస్థ ముగింపు పలికింది. ఆయుధాలు అప్పగించడంతోపాటు శాంతి ఒప్పందంపై సంతకం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం ఈ విషయం తెలిపారు. మణిపూర్ లోయ ప్రాంతాల్లో ప్రభావితంగా ఉన్న పురాతన సాయుధ సమూహం యూఎన్ఎల్ఎఫ్ హింసను వీడి ప్రధాన స్రవంతిలో చేరడానికి అంగీకరించినట్లు చెప్పారు. పురోగతి పథంలో ప్రయాణించేందుకు ప్రజాస్వామ్యంలోకి వారిని స్వాగతిస్తున్నట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు. యూఎన్ఎల్ఎఫ్ క్యాడర్ తమ ఆయుధాలను అప్పగించిన వీడియోను కూడా షేర్ చేశారు.
కాగా, మణిపూర్‌లోని లోయ ప్రాంతంలో మెజార్టీ వర్గమైన మైతీలకు ఎస్టీ హోదా ఇవ్వాలని ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. కొండ ప్రాంతాల్లో ఆధిక్యత ఉన్న కుకీ వర్గం ప్రజలు దీనిని వ్యతిరేకించారు. మే 3న భారీ ర్యాలీ నిరసన నిర్వహించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. నాటి నుంచి అల్లర్లు, హింసాత్మక సంఘటనలతో మణిపూర్ అల్లాడిపోయింది. సుమారు 200 మంది ప్రజలు మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
మరోవైపు మణిపూర్‌లో జాతి హింస చెలరేగిన తర్వాత లోయ ప్రాంతానికి చెందిన నిషేధిత సంస్థ యూఎన్‌ఎల్‌ఎఫ్‌తో ప్రభుత్వం శాంతి చర్చలు జరుపడం ఇదే తొలిసారి. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద ఎనిమిది మైతీ తీవ్రవాద సంస్థలపై ఇప్పటికే ఉన్న నిషేధాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నవంబర్ 13న పొడిగించింది. వాటిని చట్టవిరుద్ధ సంఘాలుగా ప్రకటించింది. ఈ నిషేధిత గ్రూప్‌లో యూఎన్ఎల్ఎఫ్ కూడా ఉంది.
కాగా, తిరుగుబాటు సంస్థ యూఎన్‌ఎల్‌ఎఫ్‌తో చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై సంతకం చేయబోతున్నట్లు మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నవంబర్ 26న ప్రకటించారు. అలాగే మణిపూర్‌లోని మైతీ మిలిటెంట్ గ్రూపులపై నిషేధాన్ని అమలు చేయడం, ఆంక్షలు కొనసాగించాలా వద్దా అని నిర్ణయించడానికి ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసినట్లు హోం మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది.
The peace agreement signed today with the UNLF by the Government of India and the Government of Manipur marks the end of a six-decade-long armed movement.
It is a landmark achievement in realising PM @narendramodi Ji's vision of all-inclusive development and providing a better… pic.twitter.com/P2TUyfNqq1
— Amit Shah (@AmitShah) November 29, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

