మణిపూర్ సీఎం రాజీనామా
గత రెండేండ్ల నుంచి రావణ కాష్టంగా రగులుతున్న మణిపూర్‌లో అధికార పార్టీ బీజేపీలో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి ఎన్ బీరేన్ సింగ్ ఆదివారం రాజీనామా చేశారు. సాయంత్రం తన రాజీనామా లేఖను ఆయన గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు అందజేశారు.
- అల్లర్లను ప్రోత్సహించారని బీరేన్‌సింగ్‌పై ఆరోపణలు
- బీజేపీ పాలిత ఈశాన్య రాష్ట్రంలో అనూహ్య పరిణామం
- బీరేన్‌పై సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర అసంతృప్తి
- విపక్షాలు అవిశ్వాసానికి సిద్ధమవుతుండటంతో రాజీనామా
ఇంఫాల్: గత రెండేండ్ల నుంచి రావణ కాష్టంగా రగులుతున్న మణిపూర్‌లో అధికార పార్టీ బీజేపీలో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి ఎన్ బీరేన్ సింగ్ ఆదివారం రాజీనామా చేశారు. సాయంత్రం తన రాజీనామా లేఖను ఆయన గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు అందజేశారు. ఆయన రాజీనామాను అంగీకరించిన గవర్నర్ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు సీఎంగా కొనసాగాలని బీరేన్‌ను కోరారు. అయితే ఆయన స్థానంలో కొత్త ముఖ్యమంత్రిని నియమించేది, లేనిదీ బీజేపీ అధిష్ఠానం వెల్లడించ లేదు.
ఈ పరిణామాల క్రమంలో సోమవారం నుంచి జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ రద్దు చేశారు. కాగా, తన నాయకత్వంపై సొంత పార్టీలోనే ఏర్పడిన అసమ్మతిని చల్లార్చడానికి, సభలో తనపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో బీరేన్ తన పదవికి రాజీనామా చేసినట్టు తెలిసింది. అయితే బీరేన్ నాయకత్వ మార్పును సొంత పార్టీలోనే పలువురు ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. ఈ సమయంలో సభలో నిర్వహించే విశ్వాస పరీక్షకు పార్టీ విప్ జారీ చేసినా చాలామంది ధిక్కరించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా కేంద్రంతో చర్చించిన తర్వాత బీరేన్ సీఎం పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం.
2023లో మేలో మణిపూర్‌లో తీవ్ర హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. 250 మంది మరణించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశాన్ని కుదిపేసింది. అల్లర్లను అదుపు చేయడంలో బీజేపీ ఘోరంగా విఫలమైందనే విమర్శలున్నాయి. రాష్ట్రంలో హింస సీఎం అనుమతితోనే జరిగిందంటూ ఇటీవల వెలువడిన ఒక ఆడియో క్లిప్‌ను విశ్లేషించి దాని ప్రామాణికతపై ఫోరెన్సిక్ నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని సుప్రీం కోర్టు గత వారం కేంద్రాన్ని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

