Viral Video | ఆటిజంతో బాధపడే వ్యక్తి బర్త్‌డే పార్టీ నిర్వహించిన కుటుంబసభ్యులు..అతడి రియాక్షన్ వేరే లెవెల్..!
ఆటిజంతో బాధపడే వ్యక్తి 32వ బర్త్‌డేను కుటుంబసభ్యులు ఘనంగా నిర్వహించిన వీడియో (Viral Video) నెట్టింట పలువురిని ఆకట్టుకుంటోంది.
న్యూఢిల్లీ : ఆటిజంతో బాధపడే వ్యక్తి 32వ బర్త్‌డేను కుటుంబసభ్యులు ఘనంగా నిర్వహించిన వీడియో (Viral Video) నెట్టింట పలువురిని ఆకట్టుకుంటోంది. ఇటీవల 32వ ఏట అడుగుపెట్టిన జులియన్కు కుటుంబసభ్యులు బర్త్‌డే పార్టీతో స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ బర్త్‌డే సాంగ్ పాడుతుండగా ఓ కుటుంబ సభ్యుడు అతడి రియాక్షన్‌ను రికార్డు చేశాడు.
ఈ వీడియోను మేజికల్లీ న్యూస్ ఇన్స్టాగ్రాం ఖాతాలో షేర్ చేసింది. ఈ వైరల్ క్లిప్‌లో బర్త్‌డే కేక్, ఇతర సామాగ్రి ఉన్న టేబుల్ పక్కన జులియన్ నిలబడి ఉండటం కనిపిస్తుంది. కుటుంబసభ్యులు బర్త్‌డే సాంగ్ పాడుతుండగా జులియన్ నవ్వుతుండటం చూడొచ్చు. జులియన్ వయసు ఇప్పుడు ఎంతని వారు అడగ్గా అతడు 32 అని చెప్పడం కనిపించింది.
జులియన్ నువ్వు స్టార్‌వి…శక్తిని ప్రసాదించే మెయిన్ క్యారెక్టర్ అతడని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను స్వచ్ఛమైన సంతోషమని ఇంటర్నెట్ అభివర్ణించింది. బర్త్‌డే పార్టీ పట్ల జులియన్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడని ఓ యూజర్ కామెంట్ చేశారు. ఈ అద్భుత యువకుడికి హ్యాపీ బర్త్‌డే అని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :
GOOGLE BARD | తెలుగులోనూ గూగుల్ బార్డ్ సేవలు!
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Autism
- Birthday
- MAN
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

